Bhadra Rajyog benefits: అష్టగ్రహాల్లో బుధుడు కూడా ఒకడు. ఆస్ట్రాలజీలో ఇతడిని గ్రహాల రాకుమారుడు పిలుస్తారు. ఇది సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం. తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడిగా మెర్క్యూరీని భావిస్తారు. గణేష్ ఉత్సవం చివరి రోజున అంటే అక్టోబరు 01న బుధ గ్రహ కక్ష్యలో మార్పు వల్ల అరుదైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కన్యారాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అదే సమయంలో కన్యారాశిలో చంద్ర, బుధ గ్రహాల ప్రభావం వల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం దసరా వరకు ఉంటుంది. బుధుడు కన్య మరియు మిథునం యొక్క 1 వ, 4 వ, 7 వ లేదా 10 వ ఇంట్లో ఉండటం వల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగంతో మూడు రాశుల వారిని అదృష్టం వరించనుంది. 


కన్య రాశి
ఇదే రాశిలో భద్ర రాజయోగం ఏర్పడుతుంది. దీంతో మీ కెరీర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. మీరు ఊహించని లాభాలను పొందుతారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 
సింహరాశి 
బుధుడి చేసిన భద్ర రాజయోగం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో లాభపడతారు. 
మిథునరాశి
భద్ర రాజయోగం మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. జాబ్ చేసేవారికి జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది. 


Also Read: Vinayaka chavithi 2023: వినాయక చవితి ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏమిటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook