Mercury Transits Shani Dev Planet Capricorn: శక్తి, తెలివితేటలు, నిర్వహణకు కారకుడైన బుధుడు ఫిబ్రవరి 1వ తేదిన రాశి సంచారం చేయబోతున్నాడు.  ఈ సంచారం ఫిబ్రవరి 1న కృష్ణ పక్ష షష్ఠి తిథి నాడు ఉదయం 7:20 గంటలకు జరగబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం శని ప్రత్యేక రాశి అయిన మకర రాశిలోకి జరబోతోంది. అయితే దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ గ్రహాల సంచారం కారణంగా ఏర్పడే శక్తివంతమైన ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
ఈ సంచారం కారణంగా మేషరాశి వారికి మంచి లాభాలు కలుగుతాయి. అలాగే సోదరులు, సోదరీమణుల నుంచి మంచి సపోర్ట్‌ లభించి ఆర్థికంగా కూడా లభాలు పొందుతారు. అలాగే పనుల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా కొన్ని కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో శ్రమ పెరగడం కారణంగా సమస్యలు కూడా వస్తాయి. దీంతో పాటు ఉద్యోగం, వ్యాపారాల్లో అడ్డంకులన్నీ సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. 


వృషభ రాశి:
ఈ సమయంలో వృషభ రాశి వారికి అదృష్టం పెరిగి పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు తండ్రి నుంచి సపోర్ట్ లభించి ఆర్థికంగా లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా పిల్లల నుంచి కూడా ఈ సమయంలో శుభవార్తలు వినే ఛాన్స్‌ ఉంది. డబ్బుకు సంబంధించిన పనుల్లో పురోగతి కూడా సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. 


మిథున రాశి:
ఈ సమయంలో మిథున రాశివారికి ఆనందం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ధైర్యం కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో తల్లి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


కర్కాటక రాశి:
బుధుడు శని రాశి అయిన మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల వీరికి రోజువారీ ఉపాధి పెరుగుతుంది. అంతేకాకుండా వృత్తి పరంగా కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలలో విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మానసికంగా కూడా చాలా సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter