Budh Vakri 2022: బుధుడి తిరోగమనం.. ఈ 3 రాశులవారికి అద్భుతమైన వరం!
Budh Vakri In May 2022: మే 10న బుధ గ్రహం తిరోగమనం చేయబోతోంది. మరి ఈ మెర్క్యురీ తిరోగమన ప్రభావం ఏ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.
Mercury Retrograde 2022: జ్యోతిషశాస్త్ర ప్రకారం.. గ్రహ సంచారాలు, తిరోగమనాల ప్రభావం ప్రజల జీవితాలపై చూడవచ్చు. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయం, వ్యవధి తర్వాత దాని స్థానాన్ని మారుస్తుంది. దీనిని రాశిచక్రం మార్పు అని కూడా అంటారు. ఇది కాకుండా, గ్రహాలు తిరోగమనం చేస్తాయి. ఏప్రిల్ నెలలో, దాదాపు అన్ని గ్రహాలు రాశిచక్రాన్ని మార్చాయి. మే 10న బుధ గ్రహం (Budh Vakri In May 2022) వృషభరాశిలో తిరోగమనం చేస్తుంది మరియు జూన్ 3 వరకు అదే స్థానంలో ఉంటుంది. ఏదైనా గ్రహం యొక్క తిరోగమనం కొన్ని రాశులవారికి అనుకూలంగా, మరికొన్ని రాశులవారికి బాధాకరంగా ఉంటుంది. బుధుడి తిరోగమనం ఏ రాశులవారికి ప్రయోజనకరంగా ఉందో చూద్దాం.
మీనం (Pisces): జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడు తిరోగమనం ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆఫీస్ లో మీ పనితీరుకు మంచి మార్కులు పడతాయి. లవ్ చేయడానికి మంచి సమయం. ఈ కాలంలో చేసే ప్రయాణాలు ఫలిస్తాయి. మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు.
వృషభం (Taurus): వృషభ రాశి వారికి బుధుడు దయ ఉంటుంది. పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. వీరు పరీక్షలో విజయం సాధిస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, మీరు చేయవచ్చు. మీ పనికి అభినందన లభిస్తుంది. అదే సమయంలో వ్యాపారంలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
కర్కాటకం (cancer): కర్కాటక రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు ఉండవచ్చు. నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో బలమైన అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. కొత్త స్నేహితులు పరిచయమవ్వచ్చు. అధికారులతో సంబంధాలు బలపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Venus Transit 2022: మీనరాశిలో శుక్ర సంచారం...ఆ 3 రాశులవారికి అపారమైన ప్రయోజనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook