Budh uday 2023: మేషరాశిలో ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారం..
Budh uday 2023: వచ్చే నెల 14న మేషరాశిలో బుధుడు ఉదయించబోతున్నాడు. మెర్క్యూరీ యెుక్క రైజింగ్ వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
Mercury Rise 2023 effect: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఇతడిని జ్ఞానం, సంపద, వ్యాపారం మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం మెర్క్యూరీ మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో మే 14న ఉదయించబోతున్నాడు. సాధారణంగా అస్తమయ సమయంలో గ్రహాలు చెడు ఫలితాలను, ఉదయించే సమయంలో మంచి ఫలితాలను ఇస్తాయి. మే 14 న బుధుడు ఉదయించడం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
బుధుడి ఉదయించడం ఈ రాశులకు వరం
మేషం: బుధుడు ఇదే రాశిలో ఉదయించనున్నాడు. దీని వల్ల ఈ రాశివారు మంచి ఫలితాలను పొందనున్నారు. మీ వ్యక్తిత్వం నలుగురిని ఆకట్టుకుంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపారుల భారీగా లాభాలను పొందుతారు. కొత్త పరచయాలు ఏర్పడతాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి.
కర్కాటకం: బుధుడు ఉదయించడం వల్ల కర్కాటక రాశి వారు అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు కెరీర్‌లో అపారమైన పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. బిజినెస్ విస్తరిస్తుంది. ఆదాయ సమకూరే మార్గాలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది.
Also Read: Venus Transit 2023: శుక్రుడి గోచారంతో..రేపట్నించి మే 30 వరకూ గోల్డెన్ డేస్, విదేశీ యానం
సింహం: బుధుడు రైజింగ్ వల్ల సింహరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
Also Read; Gajalaxmi Rajayogam Effect: గజలక్ష్మీ రాజయోగం ఆ 5 రాశుల జీవితాల్ని మార్చేస్తుంది, వద్దంటే డబ్బులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook