Budh Gochar 2023: ఫిబ్రవరి ప్రారంభంలో బుధుడి గోచారం.. ఈ రాశులపై కనక వర్షం..
Mercury Transit 2023: గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడు ఫిబ్రవరి మొదటి వారంలో తన రాశిని మార్చి మకరరాశిలో ప్రవేశించనున్నాడు. ఈరాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది.
Mercury Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి నెల ఏదో ఒక గ్రహం తన రాశిని మారుస్తుంది. గ్రహాల యువరాజైన బుధుడు కూడా వచ్చే నెలలో తన రాశిని మార్చనున్నాడు. ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 7.38 గంటలకు బుధ గ్రహం శనిదేవుడి రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడి యెుక్క ఈ సంచారం వల్ల ఏ రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
మేషరాశి
బుధ గ్రహం మేషరాశి జాతకంలో పదవ ఇంట్లో సంచరిస్తుంది. దీని కారణంగా మీరు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. లక్ కలిసి వచ్చి మీరు భారీగా లాభపడతారు. మీరు జాబ్ చేసే ఆఫీసులో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం బాగుంటుంది.
మకరరాశి
బుధ గ్రహ సంచారం వల్ల మకర రాశి వారు శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
వృషభం
బుధుడు వృషభ రాశి జాతకంలో తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీరు శుభవార్తలను వింటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార నిమిత్తం పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది.
కుంభ రాశి
గ్రహాల రాకుమారుడు బుధుడు కుంభరాశి జాతకంలో 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీంతో మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం నుండి సహాయసహకారాలు అందుతాయి.
తులారాశి
బుధుడు మారడం వల్ల తులారాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఈ రాశిచక్రం యొక్క జాతకంలో నాల్గవ ఇంట్లో మెర్క్యూరీ సంచరిస్తాడు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి.
Also Read: Rajyog: అరుదైన యోగం చేయబోతున్న శనిదేవుడు... వీరు ధనవంతులవ్వడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook