Mohini Ekadashi 2023: జ్యోతిష్య శాస్త్రం, హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి శుక్ల పక్ష ఏకాదశి అయితే మరొకటి కృష్ణ పక్ష ఏకాదశి. ఏకాదశి తిథి రోజున హిందువులంతా విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ రోజు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉపవాసాలు పాటించాల్సి ఉంటుంది.  మోహినీ ఏకాదశి వైశాఖ మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున వస్తుంది. ఈ ఏకాదశి విష్ణువు మరో రూపమైన మోహిని దేవతను కూడా పూజిస్తారు. మోహిని ఏకాదశి ఉపవాసాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. అయితే ఈ సంవత్సరం మోహిని ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోహినీ ఏకాదశి తేదీ, సమయం:
మే 1వ తేది సోమవారం మోహినీ ఏకాదశి.
ఏకాదశి తిథి ప్రారంభం సమయం: 30 ఏప్రిల్, రాత్రి 08:28 గంటలకు
ఏకాదశి తేదీ ముగింపు సమయం: 01 మే, రాత్రి 10:09 గంటలకు


Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి


మోహినీ ఏకాదశి పూజ విధి:
మోహినీ ఏకాదశి వ్రతంలో భక్తి శ్రద్ధలతో మహావిష్ణువును పూజించాల్సి ఉంటుంది.
మోహినీ ఏకాదశి వ్రతం పాటించే వారు తప్పకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.
లేచిన తర్వాత స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించాలి.
పూజా క్రమంలో విష్ణుమూర్తికి మంత్రాలు పఠిస్తూ, శ్లోకాలు పాడుతూ, ప్రార్థిస్తూ విష్ణువుకు తులసి, పువ్వులు, చందనం ముద్ద, పండ్లు, నువ్వులు సమర్పించండి.
ఏకాదశి వ్రతం పాటించేవారు ఈ రోజు బియ్యం, గోధుమలకు దూరంగా ఉండాలి. కేవలం వారు ఉపవాసాల క్రమంలో పాలు లేదా పండ్లను తినాల్సి ఉంటుంది.


మోహినీ ఏకాదశి ప్రాముఖ్యత:
భారతీయులంతా మోహినీ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు పూజిస్తారు. ఈ క్రమంలో విష్ణువు మోహినీ రూపంలో ఉండటం వల్ల పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తే  పాపాలు, దుఃఖాలు తొలగిపోయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook