Mokshada Ekadashi 2023: హిందూమతంలో ఏకాదశి రోజుకు చాలా మహత్యం ఉంటుంది. ఏడాది చివరి ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. అందుకే ఈ రోజుకు జ్యోతిష్యం పరంగా చాలా మహత్యం ఉంటుంది. ఈ ఏకాదశికి సంబంధించి కొన్ని నమ్మకాలు, సూచనలు ఉన్నాయి. ఇవి పాటిస్తే లెక్కలేనంత డబ్బు ఇటికి వస్తుందంటారు. అన్ని రకాల సమస్యలు దూరమౌతాయని భావిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏడాది చివరిలో వచ్చే మోక్షద ఏకాదశి రోజు అంటే విష్ణువుకు సమర్పితమైన రోజు. అందుకే ఈ రోజున కొన్ని వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశుల్లో మొదటిది కృష్ణపక్షంలో, రెండవది శుక్లపక్షంలో ఉంటుంది. ఈ రెండింట్లో రెండవ ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు. ఈరోజు కొన్ని వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుని పూజిస్తే ఆ ఇంట్లో ఎప్పటికీ ధన సంపదలు, సంతోషం వర్ధిల్లుతాయని ప్రతీతి. ఈసారి మోక్షద ఏకాదశి ఈ ఏడాదిలో చివరిది కావడంతో మహత్యం ఇంకా ఎక్కువగా ఉంది. ఈరోజున విష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని అంటారు. భక్తుల ప్రార్ధనలకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై భక్తుల కోర్కెలు నెరవేరుస్తాడని నమ్మకం. అందుకే మోక్షద ఏకాదశి రోజున కొన్ని వస్తువుల్ని తప్పకుండా ఇంటికి తెచ్చుకోవాలంటారు. 


మోక్షద ఏకాదశి ఈ ఏడాదిలో ఇదే చివరిది. డిసెంబర్ 22, 23 తేదీల్లో భక్తులు విష్ణువును ఆరాధిస్తారు. ప్రత్యేక వ్రతం ఆచరిస్తారు. హిందూ మతం విశ్వాసాల ప్రకారం మోక్షద ఏకాదశి రోజునే శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశమిచ్చాడంటారు. అందుకే మోక్షద ఏకాదశికి చాలా ప్రాధాన్యత కల్పిస్తారు. ఈ రోజున విష్ణువుని ఆరాధిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. మోక్షద ఏకాదశి రోజున విష్ణువును ఆరాధించడం వల్ల సంతాన సుఖం లభిస్తుంది. అంతేకాకుండా భక్తుల కోర్కెలన్నీ నెరవేరుతాయి. మోక్షద ఏకాదశి పురస్కరించుకుని కొన్ని వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుని పూజిస్తే అంతులేని ధన సంపదలు కలుగుతాయంటారు. 


హిందూమతంలో వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. వాస్తు దోషాన్ని దూరం చేసేందుకు ఈ రోజున ఇంటికి తెల్ల ఏనుగు విగ్రహం తెచ్చుకోవాలి. దాంతోపాటు కామధేనువుగా భావించే ఆవు విగ్రహం ఉంచుకోవాలి. ఈ రెండింటికీ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. అంతేకాకుండా చేప బొమ్మను తెచ్చుకుని పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణంతో పాటు చుట్టుపక్కలంతా పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుందని భావిస్తారు. మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయంటారు. అత్యంత భక్తిశ్రద్ధలతో తులసి మొక్కకు, చేప బొమ్మ, ఆవు విగ్రహాలకు పూజలు చేస్తే లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహం ప్రాప్తిస్తుందంటారు. 


Also read: Ayodhya Rammandir: జనవరి 22న రామమందిరం ప్రారంభం, అయోధ్యకు 1000 ప్రత్యేక రైళ్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook