Virgo September Horoscope: ప్రతి రాశి ఫలితాలు ప్రతి రోజూ, ప్రతి నెలా, ప్రతి యేటా మారుతుంటాయి. కన్యా రాశి జాతకులకు వచ్చే నెల సెప్టెంబర్ ఎలా ఉండనుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంది. ప్రతి రాశికి గ్రహాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఫలితాలుంటాయి. ఇవి రోజువారీ, నెలవారీ లేదా యేడాది లెక్కన అంచనా వేసి చెబుతుంటారు. ఇందులో భాగంగా మనం కన్యారాశి జాతకుల పరిస్థితి తెలుసుకుందాం. కన్యారాశికి వచ్చే నెల సెప్టెంబర్ ఎలా ఉండనుందో పరిశీలిద్దాం..


ఉద్యోగస్థులకు సెప్టెంబర్ చాలా అనుకూలమైన సమయం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొంతమందికి స్థాన చలనం ఇష్టపూర్వకంగా ఉంటుంది. అయితే తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకోకూడదు. వ్యాపారంలో మార్పు కోసం ఆలోచిస్తుంటే మంచి సమయం. విదేశాలతో వ్యాపారం చేసేవారికి వివిధ మార్గాల్లో లాభాలు కలుగుతాయి. 


విద్యార్ధులు చదువులో మరింత శ్రమ పడాలి. విద్యార్ధుల మనస్సు చలించే అవకాశాలున్నాయి. దాన్ని నియంత్రిస్తూ చదువుపై ఫోకస్ పెట్టాలి. ప్రేమలో ఉండే యువతీ యువకులకు ప్రేమ, రొమాన్స్ తగ్గవచ్చు. చెడు అలవాట్ల కారణంగా ప్రియురాలి ఆగ్రహానికి గురి కావచ్చు.


ఇంటి వాతావరణాన్ని అనుకూలంగా మల్చుకోవాలి. లేకపోతే అశాంతి, ఇతర సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్తలు తీసుకోకపోతే..ఇంటి పరిస్థితులు నెమ్మది నెమ్మదిగా సీరియస్‌గా మారవచ్చు. కుటుంబ సభ్యులతో వాద ప్రతివాదనలు పెట్టుకోకుండా..కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇంటి బాధ్యతలతో పాటు జీవిత భాగస్వామితో తగిన సమయం కేటాయించాలి. 


ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి అవసరం. ముందు నుంచే అనారోగ్యంతో బాధపడుతుంటే..వ్యాధి మరింతగా పెరగవచ్చు. దాంతోపాటు కీళ్ల నొప్పులు, ఎముకల సమస్య ఉత్పన్నం కాగలదు. సాధ్యమైనంతవరకూ ఇంటి భోజనం చేయాలి. లేకపోతే కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురౌతాయి.


కన్యా రాశివారికి పెండింగ్‌లో ఉన్న డబ్బు సెప్టెంబర్ నెలలో చేతికి అందుతుంది. తక్కువ సమయంలో డబ్బులు సంపాదించే క్రమంలో ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా దూరంగా ఉండాలి. సంపాదన కోసం అక్రమ మార్గాలు పట్టకూడదు. అసాంఘిక పనులు మీ సమస్యల్ని మరింతగా పెంచుతాయి.


Also read: Palmistry: మీ జీవితం ఎలా ఉంటుందో..చేతివేళ్ల ఆకారం నిర్ణయిస్తుంది, మీ వేళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook