Palmistry: మీ జీవితం ఎలా ఉంటుందో..చేతివేళ్ల ఆకారం నిర్ణయిస్తుంది, మీ వేళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

Palmistry: జ్యోతిష్యశాస్త్రాన్ని నిశితంగా పరిశీలిస్తే చాలా విషయాలు బోధపడతాయి. చేతి రేఖలే కాదు..చేతి వేళ్లను బట్టి కూడా జ్యోతిష్యం చెప్పవచ్చు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 27, 2022, 05:40 PM IST
Palmistry: మీ జీవితం ఎలా ఉంటుందో..చేతివేళ్ల ఆకారం నిర్ణయిస్తుంది, మీ వేళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

Palmistry: జ్యోతిష్యశాస్త్రాన్ని నిశితంగా పరిశీలిస్తే చాలా విషయాలు బోధపడతాయి. చేతి రేఖలే కాదు..చేతి వేళ్లను బట్టి కూడా జ్యోతిష్యం చెప్పవచ్చు. 

సాధారణంగా జ్యోతిష్యమనేది చేతి రేఖల్ని బట్టి లేదా రాశి ఫలాల్ని బట్టి చెబుతారు. కానీ చేతి వేళ్ల ఆధారంగా కూడా అతని భవిష్యత్ ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. హస్తరేఖా శాస్త్రంలో చేతి రేఖల్ని బట్టి వ్యక్తి భవిష్యత్, వర్తమానం గురించి అంచనా వేయవచ్చు. దాంతోపాటు చేతి వేళ్లను బట్టి కూడా జీవితంలో సుఖ సంతోషాలు ఏ మేరకు ఉంటాయి, కష్టనష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీ జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం..

హస్తరేఖా నిపుణుల ప్రకారం ఒక వ్యక్తి చిటికెన వేలు..చూపుడు వేలుకంటే పెద్దదిగా ఉంటే ఆ వ్యక్తికి సాహిత్యం, కళలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అయితే చేసే పనుల్లో అంత సులభంగా విజయం లభించదు. రెండు వేళ్లు ఒకేలా ఉంటే ఆ వ్యక్తికి డబ్బుకు ఏవిధమైన సమస్య తలెత్తదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

ఓ వ్యక్తి మధ్య వేలు చూపుడువేలు కంటే పెద్దదిగా ఉంటే..జీవితంలో వివిధ రకాల సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ వ్యక్తి ఎప్పుడూ దుఖంలోనే ఉంటాడు. అతడు తీసుకున్న నిర్ణయాలే అతడిని ఇబ్బందుల్లో నెట్టుతాయి. ఫలితంగా కుటుంబసభ్యులు కూడా సమస్యలు ఎదుర్కొంటారు. 

వ్యక్తి మధ్య వేలు..చూపుడు వేలు కుంటే చిన్నదిగా ఉంటే అది శుభం కాదని అర్ధం. ఎప్పుడూ కలల్లోనే ఉంటారు. పని తక్కువ చేస్తూ..కలలు ఎక్కువ కంటారు. సామర్ధ్యం తక్కువగా ఉంటుంది. కానీ మధ్యమ వేలు, చూపుడు వేలు సమానంగా ఉంటే మాత్రం..ఆ వ్యక్తికి అంతా శుభమే. పదోన్నతి, సాఫల్యం లభిస్తాయి. అన్ని చోట్లా గౌరవ మర్యాదలు దక్కుతాయి. 

Also read: Shani Amavasya 2022: 14 ఏళ్ల తరువాత శని అమావాస్య, ఇలా చేస్తే శని పీడ, శని దోషం నుంచి విముక్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News