Monthly Horoscope July 2022: జూలై నెలలో పుట్టినవారి టోటల్ నెంబర్‌ను బట్టి జాతకం ఇలా ఉంటుంది
Monthly Horoscope July 2022: జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. పుట్టిన తేదీ టోటల్ నెంబర్‌ను బట్టి ఆ వ్యక్తుల జాతకం ఎలా ఉంటుందో చెప్పేదే న్యూమరాలజీ లేదా సంఖ్యాశాస్త్రం. మరి జూలై నెలలో ఎవరి జాతకం ఎలా ఉంటుందో చూద్దాం.
Monthly Horoscope July 2022: జ్యోతిష్యశాస్త్రంలో సంఖ్యాశాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. పుట్టిన తేదీ టోటల్ నెంబర్‌ను బట్టి ఆ వ్యక్తుల జాతకం ఎలా ఉంటుందో చెప్పేదే న్యూమరాలజీ లేదా సంఖ్యాశాస్త్రం. మరి జూలై నెలలో ఎవరి జాతకం ఎలా ఉంటుందో చూద్దాం.
జూలై 2022లోని కొన్ని తేదీల్లో పుట్టినవారి జాతకాలు చాలా అద్భుతంగా ఉండనున్నాయి. అత్యంత లాభదాయకంగా ఉంటాయి. జూలై నెల వారి జీవితంలో ఆనందాలు, సంపద, అభివృద్ధిని తీసుకురానున్నాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టినతేదీ టోటల్ నెంబర్ 2 అయితే లెక్కలేనంత డబ్బు వస్తుంది. అదే టోటల్ 3 అయితే లాభాలు ఆర్జిస్తారు. టోటల్ 1 నుంచి టోటల్ 9 వరకూ ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో..ఆ వివరాలు పరిశీలిద్దాం..
మీ పుట్టిన తేదీ టోటల్ 1 అయితే ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యవసాయంలో, ఉద్యోగాల్లో కాస్త ఇబ్బందులు ఎదురుకావచ్చు. వ్యక్తిగతంగా మీకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మొదలు కావచ్చు. ఏదైనా పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది.
ఇక పుట్టిన తేదీ టోటల్ 2 అయితే లాభదాయకంగా ఉంటుంది. పాత అప్పుల్నించి విముక్తి పొందుతారు. ప్రేమ, వైవాహిక సంబంధాల్లో వివాదం తలెత్తవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి అధికమౌతుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.
ఇక పుట్టినతేదీ టోటల్ 3 అయితే..అనుకూలంగా ఉంటుంది. సుదూర యాత్రలు చేస్తారు. ఈ నెల ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా లాభాలు ఆర్జిస్తారు. కుటుంబంలో ఐకమత్యం, ప్రేమ లభిస్తుంది. కోపాన్ని నిగ్రహించుకోవడం మంచిది.
పుట్టినతేదీ టోటల్ నెంబర్ 4 అయితే..పాత పధకాలు పూర్తయి..ఆర్ధికంగా లాభపడతారు. కొత్త బంధాలతో ప్రేమ, ఆర్ధిక ప్రయోజనాలు చేకురుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. పెద్ద పెద్ద పెట్టుబడుల్నించి దూరంగా ఉంటే మంచిది.
టోటల్ నెంబర్ 5 అయితే..వ్యాపారం, ఉద్యోగాలకు మంచిది. ప్రేమ సంబంధాలు, మిత్రుల్నించి మోసపోయే అవకాశాలున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. భూమి కొనుగోలు చేయవచ్చు. విద్యారంగంలో విజయం సాధిస్తారు.
ఇక మీ పుట్టినతేదీ టోటల్ నెంబర్ 6 అయితే..సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురౌతాయి. విడాకులు కూడా తీసుకోవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధికంగా బాగుంటుంది. విద్యార్ధులపై దృష్టి పెట్టాలి.
పుట్టినతేదీ టోటల్ నెంబర్ 7 అయితే..ఈ నెలంతా సమృద్ధిగా ఉంటుంది. వ్యవసాయంలో వృద్ధి సాధిస్తారు. కొత్త యూనిట్లు ప్రారంభిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు, బోనస్ లభిస్తాయి. వైవాహిక జీవితం బాగుండటంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది. నెల ప్రారంభంలో కీలకమైన కొనుగోళ్లు జరుపుతారు.
పుట్టినతేదీ టోటల్ 8 అయితే సంఘర్షణ ఉన్నా ధనలాభం ఉంటుంది. పెండింగులో ఉన్న కోర్కెలు నెరవేరుతాయి. సంతాన సుఖం ప్రాప్తిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పాత గొడవల్నించి రిలీఫ్ లభిస్తుంది. పాత రోగాలు పోతాయి. పోటీ పరీక్షల్లో విజయం మీదే.
ఇక పుట్టినతేదీ టోటల్ 9 అయితే చాలా మార్పులు చూస్తారు. అయితే అన్నీ స్వల్పకాలికమే. ఇంట్లో కొద్దిగా మార్పు ఉంటుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. సంతానం విషయంలో గుడ్‌న్యూస్ వింటారు.
Also read: Vastu Tips for Home: శ్రావణ మాసంలో ఇంట్లో ఈ ఒక్క మొక్క నాటితే చాలు.. అన్ని దోషాలు తొలగిపోతాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.