Monthly Horoscope May 2023: వచ్చే నెల గ్రహ సంచారాల పరంగా చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా మే నెల ప్రారంభంలో చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. మేలో శుక్రుడు మిథునరాశిలోకి, కుజుడు కర్కాటక రాశిలోకి, సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతోపాటు బుధుడు ఉదయించబోతున్నాడు. ఈ గ్రహాల గోచారం ముఖ్యంగా కొన్ని రాశులవారికి మేలు చేయనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి: మే నెలలో గ్రహాల రాశి మార్పు కారణంగా ఈ రాశి వారు అనేక సమస్యల నుండి బయటపడతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పపరిస్థితి బలపడుతుంది. 
వృషభ రాశి: గ్రహాల గోచారం కారణంగా మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీరు పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విదేశాలకు సంంబంధించిన వ్యాపారం చేసేవారు ప్రయోజనం పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. 
కర్కాటక రాశి: మే నెల కర్కాటక రాశి వారికి ఉద్యోగ-వ్యాపారాలలో లాభాలను ఇస్తుంది. కోర్టు కేసుల నుండి బయటపడతారు. బిజినెస్ బాగుంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 


Also Read: Budh uday 2023: మేషరాశిలో ఉదయించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారం..


కన్యా రాశి: ఈ మాసంలో కన్యారాశివారికి ఉద్యోగం లభిస్తుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీకు కీర్తిప్రతిష్టలతోపాటు పదవి కూడా దక్కుతుంది. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. లాభాలు పెరుగుతాయి. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 
మీన రాశి; మే నెలలో మీనరాశి వారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. మీ జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు, వారి వివాహం ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. 


Also Read: Venus Transit 2023: శుక్రుడి గోచారంతో..రేపట్నించి మే 30 వరకూ గోల్డెన్ డేస్, విదేశీ యానం 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook