Goddess Durga idols: ఈ దుర్గా దేవి విగ్రహం ప్రత్యేకత ఏంటో తెలుసా ?
Goddess Durga idols news updates: ముంబై: ప్రతీ సంవత్సరం, వినాయక చవితి సందర్భంలో, దుర్గాదేవి నవరాత్రులు సందర్భంలో కళాకారులు తమ ప్రతిభతో ప్రత్యేకమైన విగ్రహాలను సృష్టించడం గురించి కొన్ని వార్తలు మనం చూస్తుంటాం. అలాగే ఈసారి కూడా దుర్గాదేవి నవరాత్రులు ( Durga Devi Navratri 2020 ) ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల సందర్బంగా చేతన్ రావత్ అనే కళాకారుడు సృష్టించిన దుర్గా దేవి విగ్రహం అందరిని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
Goddess Durga idols news updates: ముంబై: ప్రతీ సంవత్సరం, వినాయక చవితి సందర్భంలో, దుర్గాదేవి నవరాత్రులు సందర్భంలో కళాకారులు తమ ప్రతిభతో ప్రత్యేకమైన విగ్రహాలను సృష్టించడం గురించి కొన్ని వార్తలు మనం చూస్తుంటాం. అలాగే ఈసారి కూడా దుర్గాదేవి నవరాత్రులు ( Durga Devi Navratri 2020 ) ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల సందర్బంగా చేతన్ రావత్ అనే కళాకారుడు సృష్టించిన దుర్గా దేవి విగ్రహం అందరిని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. Also read : Nartanasala first look: బాలక్రిష్ణ, సౌందర్య నటించిన 'నర్తనశాల' ఫస్ట్ లుక్ డీటేల్స్
ముంబైకి చెందిన చేతన్ రావత్ ( Chetan Raut ) అనే కళాకారుడు 31,000 పుష్ పిన్‌లను ( Push pins ) ఉపయోగించి 6 అడుగుల పొడవైన దుర్గాదేవి పోట్రేట్‌ను రూపొందించారు. చేతన్ రౌత్ మీడియాకి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మొజాయిక్ కళను ( Mosaic art ) రూపొందించడానికి అతనికి 36 గంటలు పట్టిందట. అలాగే ఈ చిత్రం కోసం మరో ఆరుగురు వ్యక్తుల సహాయంతో, ఆరు రంగుల పిన్నులను ఉపయోగించినట్లు పేర్కొన్నాడు.
ఇలా చేతన్ రావత్ మాత్రమే కాదు, కోల్‌కతాకు చెందిన మరో కళాకారుడి సృజనాత్మకత కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన నలుగురు పిల్లలతో వలస వచ్చిన స్త్రీని పోలి ఉండే ఒక ప్రత్యేకమైన దుర్గా దేవి విగ్రహాన్ని తయారుచేశాడు. ఈ విగ్రహంలో తన నలుగురు సంతానం లక్ష్మి, సరస్వతి, కార్తీక్, గణేష్‌లను కూడా చూడవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మైగ్రెంట్ దుర్గా దేవి విగ్రహం ( Migrant Durga devi idol ) వైరల్ అవుతోంది. Also read : Ninnila Ninnila first look: కొత్తగా ఉన్న నిన్నిలా నిన్నిలా ఫస్ట్ లుక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe