Nartanasala first look: బాలక్రిష్ణ, సౌందర్య నటించిన 'నర్తనశాల' ఫస్ట్ లుక్ డీటేల్స్

Balakrishna, Soundarya in Nartanasala movie: పౌరాణిక చిత్రాలలో శ్రీ రాముడైనా, శ్రీ కృష్ణుడైనా తెలుగు ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది అన్న గారు సర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన నట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా ఈ జానర్ సినిమాల్లో బాగా ఒదిగిపోతారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సునాయాసంగా చెప్పేయగలరు. దసరా పండగ ( Dasara festival 2020) సందర్బంగా అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు బాలయ్య బాబు.

Updated: Oct 20, 2020, 01:16 AM IST
Nartanasala first look: బాలక్రిష్ణ, సౌందర్య నటించిన 'నర్తనశాల' ఫస్ట్ లుక్ డీటేల్స్

Balakrishna, Soundarya in Nartanasala movie: పౌరాణిక చిత్రాలలో శ్రీ రాముడైనా, శ్రీ కృష్ణుడైనా తెలుగు ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది అన్న గారు సర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన నట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న తనయుడు నందమూరి బాలకృష్ణ ( Balakrishna Nandamuri ) కూడా ఈ జానర్ సినిమాల్లో బాగా ఒదిగిపోతారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సునాయాసంగా చెప్పేయగలరు. దసరా పండగ ( Dasara festival 2020 ) సందర్బంగా అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు బాలయ్య బాబు. Also read : Ninnila Ninnila first look: కొత్తగా ఉన్న నిన్నిలా నిన్నిలా ఫస్ట్ లుక్

Balakrishna's directorial venture; బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో..
బాలక్రిష్ణ, సౌందర్య ( Soundarya ) కీలక పాత్రల్లో, బాలక్రిష్ణ స్వీయ దర్శకత్వంలో ఎన్నో అంచనాల మధ్య మొదలైన 'నర్తనశాల' చిత్రం షూటింగ్ ( Nartanasala shooting ) కొద్ది రోజులకే ఆగిపోయింది. ఆ సినిమాకి సంబంధించిన 17 నిముషాల వీడియోను ( Nartanasala movie clippings ) దసరా కానుకగా ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు బాలక్రిష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం మధ్యాహ్నం గం. 12.30 లకు విడుదల చేయనున్నారు.

నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు...

Posted by Nandamuri Balakrishna on Monday, October 19, 2020

ఈ సందర్బంగా నందమూరి బాలక్రిష్ణ తన సోషల్ మీడియా ద్వారా పలు వివరాలు వెల్లడిస్తూ.. "నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్.బి.కె థియేటర్‌లో ( NBK Theatre ) శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది'' అని తెలిపారు. Also read : Actress Pooja Hegde: పూజా హెగ్డెకు మరో బంపర్ ఆఫర్

'' అర్జునుడిగా నేను ( Balakrishna as Arjuna ), ద్రౌపదిగా సౌందర్య ( Soundarya as Draupadi ), భీముడిగా శ్రీహరి ( Srihari as Bheemudu), ధర్మరాజుగా శరత్ బాబు ( Sharat Babu as Dharmaraju ) గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్‌కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక  ఈ నెల 24న నెరవేరబోతోంది" అని బాలయ్య బాబు వెల్లడించారు.

నర్తనశాల చిత్ర షూటింగ్ కొంత పూర్తయిన తరువాత సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో ( Soundarya's death in helicopter crash ) మరణించడంతో ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ఎప్పటికైనా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానని బాలక్రిష్ణ అనేక వేదికలపై చెబుతూ వచ్చారు. ఐతే సౌందర్య లాంటి అద్భుత నటి దొరికినప్పుడే ఆ చిత్రాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తాను అని బాలయ్య బాబు గతంలోనే ప్రకటించారు. కానీ, ఎందుకో కానీ అది కార్యరూపం దాల్చలేదు. అసలు ఈ సినిమా మళ్లీ చిత్రీకరణ జరుపుకుంటుందా? అనే సందేహాల మధ్య బాలక్రిష్ణ ఈ ప్రకటన చేయడం నందమూరి, సౌందర్య అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. Also read : Most eligible bachelor teaser update: మ్యారేజ్ లైఫా.. అయ్యోయ్యోయ్యో అంటున్న అఖిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe