Naga Panchami Importance: ఇవాళ అంటే ఆగస్టు 2న నాగ పంచమి (Naga Panchami 2022). ఈ పండుగను శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదో రోజున జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను పూజించడం వల్ల ఇంట్లో ధనం మరియు ధాన్యానికి ఎప్పుడూ కొరత ఉండదని నమ్ముతారు. ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం ఉందో వారు నాగదేవతతోపాటు (Naga Devatha Puja) శివుడిని పూజించాలి. అయితే నాగ పంచమిని పూజించే రోజు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. ఇవాళ పాములకు పాలు పోసి.. ఇంటి గుమ్మం వద్ద పాము బొమ్మను చిత్రిస్తారు. ఇలా చేయడం వల్ల నాగదేవత అనుగ్రహం ఆ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాగ పంచమి రోజున ఈ పని చేయండి
>> నాగ పంచమి రోజున ఉపవాసం ఉండటం వల్ల పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు.
>> ఈ రోజున నాగదేవతను పూజించేటప్పుడు.. పాలు, స్వీట్లు మరియు పువ్వులు ఆ దేవతకు సమర్పించాలి.
>> ఎవరి జాతకంలో రాహు కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుందో... వారు నాగ పంచమి రోజున నాగదేవతను తప్పక పూజించాలి.
>> నాగదేవతకు ఇత్తడి కుండతో పాలు ఎప్పుడూ పెట్టకూడదు. అయితే అందుకోసం రాగి పాత్రను వాడటం మంచిది. 


నాగ పంచమి రోజు పొరపాటున కూడా ఈ పని చేయకండి
>> మీరు రైతు అయితే నాగ పంచమి రోజున పొరపాటున కూడా వ్యవసాయ పనులు చేయకూడదని గుర్తుంచుకోండి.
>> ఈ రోజు చెట్లను నరికివేయడం నిషిద్ధం. నాగ పంచమి రోజున చెట్లను నరకడం వల్ల పాములు గాయపడతాయి, ఎందుకంటే పాములు తరచుగా చెట్లలో దాగి ఉంటాయి.
>> నాగ పంచమి రోజున సూది దారాన్ని ఉపయోగించడం కూడా అశుభంగా భావిస్తారు.
>> ఈ రోజున పదునైన వస్తువులను ఉపయోగించడం మానుకోవాలి.


Also Read: Naga Panchami 2022: నాగ పంచమి రోజున ఈ పని అస్సలు చేయకండి, మీ సంపద మెుత్తం పోతుంది! 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook