Naga Panchami 2022: నాగ పంచమి రోజున ఈ పని అస్సలు చేయకండి, మీ సంపద మెుత్తం పోతుంది!

Naga Panchami 2022: ఈ రోజు నాగపంచమి. ఇవాళ నాగదేవతతోపాటు శివుడిని కూడా పూజిస్తారు. దీంతో మీ కోరికలు నెరవేరుతాయి. ఈ రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 2, 2022, 08:31 AM IST
Naga Panchami 2022: నాగ పంచమి రోజున ఈ పని అస్సలు చేయకండి, మీ సంపద మెుత్తం పోతుంది!

Naga Panchami 2022: ఇవాళ అంటే ఆగస్టు 2, మంగళవారం నాగ పంచమి. ఈ రోజున నాగదేవతను పూజిస్తారు. ఈపండుగను శ్రావణ మాసంలోని శుక్లపక్షం ఐదో రోజున జరుపుకోవడం అనవాయితీ. ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధం. ఇవాళ ఈ పనులు చేయడం వల్ల నాగదేవతకు (Naga devatha) కోపం వస్తుంది. నాగదేవత సంపదకు రక్షకుడు. కాబట్టి ఈ దేవతకు ఆగ్రహం తెప్పించే పనులు చేస్తే...అది మీ  ఇంట్లోని ఆనందాన్ని, సంపదను హరించి వేస్తుంది. నాగ పంచమి రోజు ఈ పనులు చేయకూడదో తెలుసుకుందాం. 

ఈరోజు చేయకూడని పనులు
భూమిని తవ్వకండి: నాగ పంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని తవ్వకండి. సాధారణంగా పాములు మట్టిలో నివసిస్తాయి. మీరు భూమిని తవ్వడం వల్ల వాటికి హాని కలుగుతుంది. అంతేకాకుండా ఏడాదిలో  ఎప్పుడూ కూడా పామును ఉద్దేశపూర్వకంగా వేధించవద్దు లేదా బాధించవద్దు. 
ఆకుకూరలు కోయవద్దు: నాగ పంచమి రోజున ఆకుకూరలు కోయడం నిషిద్ధం. ఆకుకూరలు ఉన్న కూరగాయలు కూడా ఈ రోజు తినకూడదు. 
చెట్లను నరకవద్దు: పాములు కూడా చెట్లలో నివసిస్తాయి. కాబట్టి నాగ పంచమి రోజు చెట్లను నరకవద్దు.  
పదునైన వస్తువులు వాడవద్దు: నాగ పంచమి రోజు సూది దారాన్ని ఉపయోగించకండి. అంతేకాకుండా ఇతర పదునైన వస్తువులను కూడా వాడటం మానుకోండి.
శివుడిని తప్పక పూజించాలి: నాగ పంచమి రోజు తప్పకుండా శివుడిని పూజించండి. మహాదేవుడిని ఆరాధించకుండా నాగదేవత ఆరాధన సంపూర్ణం కాదు. 

Also Read: Sawan Purnima 2022: శ్రావణ పూర్ణిమ ఎప్పుడు? రాఖీ పండుగ ప్రాముఖ్యత ఏంటి?

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News