Naga panchami 2022: నాగపంచమి రోజు ఇంటి బయట ఈ ఒక్క పేరు రాయండి చాలు.. పాములు ఎప్పుడూ మీ ఇంట్లోకి రావు!
Nag panchami 2022: ఈ ఏడాది నాగపంచమి ఆగస్టు 2, 2022. ఈ రోజున ఇంటి బయటి గోడపై ఈ మహర్షి పేరు రాస్తే.. పాములు ఇంట్లోకి రావని నమ్ముతారు. దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం రండి.
Nag panchami 2022: శ్రావణ మాసం శుక్ల పక్షం ఐదవ రోజున నాగపంచమి పండుగ జరుపుకుంటారు. ఈసారి నాగ పంచమి (Nag panchami 2022) ఆగస్టు 2వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున భక్తులను నాగదేవతను పూజిస్తారు. శ్రావణ పంచమి పాములకు ఎంతో ప్రియమైనది. ఎందుకంటే ఈ రోజున పాములన్నీ నాశనం కాకుండా ఓ మహర్షి అడ్డుకున్న రోజు. ఈ మహర్షి పేరును మీ ఇంటి బయటగోడపై రాసినట్లయితే ఎటువంటి పాము మీ ఇంట్లోకి ప్రవేశించదని చెబుతారు. ఆ మహర్షి ఎవరో, దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దీని వెనుక ఉన్న కథ
మహాభారత కాలంలో శమీక ముని కుమారుడైన శృంగి..తక్షకుడి అనే పాము కాటు వల్ల నువ్వు వారం రోజుల్లో మరణిస్తావ్ అని అభిమన్యుడు పుత్రుడైన పరీక్షిత్తుకు శాపమిస్తాడు. ఆ పాము కాటుకు పరీక్షిత్తు మరణిస్తాడు. తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకునేందుకు పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు సర్పయాగాన్ని ప్రారంభిస్తాడు. దీంతోపాములన్నీ ఆ యాగంలో పడి మరణిస్తాయి. దీంతో సర్పాలు తమను రక్షించమని అస్తీక మునిని (Aastik muni) వేడుకుంటాయి. అప్పుడు ఆస్తీకుడు జనమేజయుడి దగ్గరకు వెళ్లి యాగాన్ని ఆపివేస్తాడు. ఈ యాగాన్ని ఆపించి పాములను రక్షించాడు కాబట్టి ఆస్తీకుడు పేరు ఏ ప్రదేశంలో రాస్తే ఆ ప్రాంతంలోకి తాము ప్రవేశించమని పాములన్నీ అ మునికి వాగ్దానం చేశాయి. అందుకే 'అస్తీక ముని' పేరును ఇంటి బయట గోడలపై రాసుకుంటారు.
Also Read: Naga Panchami 2022: నాగపంచమికి సంబంధించిన ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook