Narak Chaturdashi 2023 Importance and Muhurat: ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని చతుర్దశి రోజున నరక చతుర్దశిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం నవంబర్ 11న నరక చతుర్దశి వచ్చింది. ఈ రోజునే శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి సుమారు 16 వేల మంది మహిళలకు విముక్తి కలిగిస్తాడు. కృష్ణుడు సాధించిన విజయానికిగాను నరక చతుర్దశిని జరుపుకుంటారు. ఈ రోజు శ్రీకృష్ణుడి భక్తులు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు. అయితే ఏయే సమయాల్లో ప్రత్యేక పూజలు చేయడం శ్రేయస్కరమో, నరక చతుర్దశి విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నరక చతుర్దశి 2023 శుభ సమయం:
చతుర్దశి తిథి నవంబర్  11న మధ్యాహ్నం 1:57 గంటలకు ప్రారంభమవుతుంది. 12 నవంబర్ 2023న మధ్యాహ్నం 02:44 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  


నరక చతుర్దశి విశిష్టత:
నరక చతుర్దశి రోజు ప్రత్యేక సమయాల్లో వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు నశిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రోజుయ భక్తులు ఉపవాసాలు కూడా పాటిస్తారు. 


Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్


అభ్యంగ స్నాన సమయం:
నరక చతుర్దశి అభ్యంగ స్నానాన్ని ఆచరించేవారు కేవలం ప్రత్యేక ముహూర్తాల్లో చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం నవంబర్‌ 11న ఉదయం 05:27 నుంచి ఉదయం 06:40లోపు చేయడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. 
 
కాళీమాత పూజ ముహూర్తం:
సాయంత్రం 11:38 నుంచి నవంబర్ 12 ఆర్దరాత్రి 12:31 వరకు.. 
పూజ ముహూర్తం వ్యవధి: 53 నిమిషాలు


ఈ సమయాల్లో మాత్రమే దీపాలు వెలిగించాలి:
నరక చతుర్దశి రోజున 14 దీపాలు వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించడం వల్ల జీవితంలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు నరక చతుర్దశి రోజున యమ నామంతో దీపం వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. 


నరక చతుర్దశి రోజున చేయకూడని పనులు:
నరక చతుర్దశి నాడు మృత్యుదేవతగా భావించే యమధర్మరాజును పూజిస్తారు. కాబట్టి ఈ రోజు ఏ ప్రాణికి కూడా హానికలిగించకూడదని పూరాణాల నుంచి వస్తున్న ఆనవాయితి..దీనితో పాటు ఇంటి దక్షిణ దిశలో ఎలాంటి చెత్తను కూడా ఉంచకూడదు. 


Also Read: Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టిన రాయగడ ఎక్స్‌ప్రెస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి