New Year 2023 Vastu Tips: నూతన సంవత్సరంలో ఈ చిన్నచిన్న పరిహారాలు చేస్తే.. సంవత్సరం పొడవునా డబ్బే డబ్బు!
New Year 2023 Vastu Tips for Home. నూతన సంవత్సరంలో ఈ వస్తువులను ఇంటికి తీసుకెళ్లితే.. సంవత్సరం పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది. వాస్తు చిట్కాలలో పాటించాల్సిన ఆ వస్తువులు ఏవో ఇప్పుడు చూద్దాం.
New Year 2023 Vastu Tips for Home: ఎన్నో మధుర మృతులు, జ్ఞాపకాలు, సంతోషాలు, విషాదాల మధ్య ప్రతిఒక్కరికి 2022 ఏడాది ముగిసింది. నూతన సంవత్సరం 2023 ఆరంభం అయింది. కొత్త సంవత్సరంలో సంపద, శ్రేయస్సు, ఆనందం మరియు పురోగతిని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రతిఒక్కరిని ప్రార్ధించే ఉంటారు. కేవలం దేవుడిని ప్రార్ధించడం మాత్రమే కాకుండా.. మన చుట్టుపక్కల వాతావరణంను కూడా సానుకూలంగా ఉంచుకోవాలి. నూతన సంవత్సరంలో ఈ వస్తువులను ఇంటికి తీసుకెళ్లితే.. సంవత్సరం పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది. వాస్తు చిట్కాలలో పాటించాల్సిన ఆ వస్తువులు ఏవో ఇప్పుడు చూద్దాం.
క్యాలెండర్:
క్యాలెండర్‌ను ఇంట్లో తూర్పు, పడమర లేదా ఉత్తరం వైపు మాత్రమే ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం ఉంటాయి. దక్షిణ దిశలో కొత్త క్యాలెండర్‌ను పెట్టడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. క్యాలెండర్‌ను ఈశాన్య దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇది మీ జీవితంలో అదృష్టాన్ని తెస్తుంది.
వాష్‌రూమ్:
మీ ఇంట్లో నిరంతర ఆర్థిక సంక్షోభం మరియు గొడవలు ఉంటే.. ఇంట్లో టాయిలెట్-వాష్‌రూమ్ దిశను తనిఖీ చేయండి. నైరుతి దిశలో నిర్మించిన మరుగుదొడ్డి మీకు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. వెంటనే దాన్ని మార్చి ఉత్తరం లేదా వాయువ్య దిశలో కట్టండి. ఎప్పుడైనా టాయిలెట్ వంటగది ముందు లేదా పక్కన ఉండకూడదని గుర్తుంచుకోండి.
ఉప్పు నీరు:
ప్రతి వారం ఉప్పు నీటితో ఇళ్లు తుడుచుకోండి. ఈ పరిహారాన్ని ప్రతి ఆదివారం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివిటీ పోయి సానుకూలత వస్తుంది. స్నానపు నీటిలో కొద్దిగా సముద్రపు ఉప్పును కలిపి వారానికి ఒకసారి స్నానం చేయండి.
గాజు పాత్ర:
రుణ భారం ఎక్కువగా ఉంటే.. ఇంటి లోపల ఈశాన్య దిశలో గాజు పాత్రను పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. గాజు రంగు మెరూన్, ఎరుపు లేదా వెర్మిలియన్ ఉండకూడదు.
తులసి మొక్క:
లక్ష్మిదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే తులసి మొక్కని పూజించండి. నూతన సంవత్సరంలో ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటండి. తులసికి ఉదయం పూట నీళ్ళు సమర్పించి.. సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి. దీని వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆదివారం, ఏకాదశి నాడు తులసిని ముట్టకూడదు. అంతేకాదు నీరు పోయకూడదు అని గుర్తుంచుకోండి.
Also Read: Shani shukra Yuti 2023: శని శుక్ర యుతి 2023.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులు మొదలు! ఇల్లు నిండా డబ్బే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.