Shani shukra Yuti 2023: శని శుక్ర యుతి 2023.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులు మొదలు! ఇల్లు నిండా డబ్బే

Aries, Virgo and Libra zodiac sign peoples will get immense money due to Venus Saturn Transit 2023. మకర రాశిలో శుక్ర మరియు శని కలయిక త్వరలో ఏర్పడుతోంది. శని శుక్ర యుతి 2023 కొంత మందికి చాలా శుభప్రదంగా ఉండనుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 2, 2023, 08:26 AM IST
  • శని శుక్ర యుతి 2023
  • ఈ 3 రాశుల వారికి మంచి రోజులు మొదలు
  • ఇల్లు నిండా డబ్బు సంచులే
Shani shukra Yuti 2023: శని శుక్ర యుతి 2023.. ఈ 3 రాశుల వారికి మంచి రోజులు మొదలు! ఇల్లు నిండా డబ్బే

These 3 zodiac signs will get immense money due to Conjunction of Venus and Saturn in Capricorn: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... శనిని చర్యల దేవుడుగా పరిగణిస్తారు. శని దేవుడు ఓ వ్యక్తి కర్మల ప్రకారం అతడికి ఫలితాలను ఇస్తాడు. శని వల్ల మంచి, చెడు ప్రభావాలు రెండూ ఓ వ్యక్తిపై ఉంటాయి. అందువల్ల శని చెడు దృష్టి తమపై పడకూడని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే.. శని ప్రభావం ఉంటే ఓ వ్యక్తి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబం, డబ్బు, ఆదాయం, వ్యాపారం అన్నింటిపై ప్రభావం ఉంటుంది. 

సంపద, విలాసం, ప్రేమ, శృంగార ప్రదాతగా శుక్రుడిని పరిగణిస్తారు. మకర రాశిలో శుక్ర మరియు శని కలయిక త్వరలో ఏర్పడుతోంది. ఇది (శని శుక్ర యుతి) కొంత మందికి చాలా శుభప్రదంగా ఉండనుంది. వాస్తవానికి జ్యోతిషశాస్త్రంలో.. శని మరియు శుక్ర గ్రహాల మధ్య స్నేహభావం ఉంటుంది. అందుకే 3 రాశుల వారు శని మరియు శుక్ర గ్రహాల కలయికతో భారీగా డబ్బు పొందుతారు. ఇల్లు నిండా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేష రాశి:
శని మరియు శుక్ర గ్రహాల కలయిక మేష రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. మేష రాశి వారి వ్యాపార మరియు వృత్తి పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందవచ్చు. విదేశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. అలాగే వ్యాపారవేత్తలు పెద్ద ఆర్డర్‌లను పొందవచ్చు.

కన్యా రాశి: 
మకర రాశిలో శని, శుక్ర కలయిక కన్యా రాశి వారికి చాలా శుభప్రదం అవుతుంది. ఈ వ్యక్తుల వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. అవివాహికులకు వివాహం జరుగుతుంది. జీవితంలో స్థిరపడతారు. కెరీర్ కూడా బాగుంటుంది.

తులా రాశి: 
తులా రాశికి అధిపతి శుక్రుడు. ఈ నేపథ్యంలో శని-శుక్ర కలయిక తులా రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఈ వ్యక్తుల ఆదాయం భారీగా పెరగవచ్చు. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఆదాయ వనరులు కూడా పెరగవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

Also Read: Gold Price Today: రూ.56 వేల చేరువలో బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?  

Also Read: Shivling Puja Procedures: శివలింగానికి నీటిని సమర్పించే విధానాలు.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News