Nirjala Ekadashi 2023: నిర్జల ఏకాదశి వ్రత ప్రాముఖ్యత, ఉపవాసంతో వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
Nirjala Ekadashi 2023: నిర్జల ఏకాదశి రోజున ఈ పూజా నియమాలతో వ్రతాన్ని పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని స్త్రీలు శ్రద్ధలతో పాటించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి.
Nirjala Ekadashi 2023: హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఏకాదశుల్లో నిర్జల ఏకాదశి ఒకటి. ఈ ఏకాదశి రోజు సూర్యోదయం నుంచి ఉపవాసాలు పాటించి లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల సర్వపాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ ఏకాదశి వ్రతం పాటించడం వల్ల సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతం మే 31 తేదీన ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటో? ఏ నియమాలతో పూజా కార్యక్రమం చేయాలో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శుభ సమయం:
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్జల ఏకాదశి ఉపవాసం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున పాటిస్తారు. ఈ వ్రతాన్ని పాటించేవారు మే 30 మధ్యాహ్నం 01:07 గంటలకు ఉపవాసాలను ప్రారంభించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also read: CSK Vs GT Rain Updates: ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..
పూజా విధానం:
నిర్జల ఏకాదశి రోజున వ్రతాన్ని పాటించేవారు తప్పకుండా గంగా నది స్నానం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పూజా కార్యక్రమంలో భాగంగా తులసి, పసుపు చందనం, ధూపం-దీపం, తీపి నైవేద్యం పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పూజా ప్రారంభించే ముందు విష్ణుమూర్తి విగ్రహాలకు అభిషేకం చేయాల్సి ఉంటుంది. పాలు, తేనెతో గానీ విష్ణుమూర్తి విగ్రహాలకు అభిషేకం చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇలా అభిషేకం చేసిన తర్వాత మందిరం గదిలో విగ్రహాలను అలంకరించి ధూప దీపం సమర్పించాల్సి ఉంటుంది. ఇలా సమర్పించిన తర్వాత 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. స్వామివారికి మొదటగా నైవేద్యంగా పండ్లను సమర్పించాలి. తర్వాత కొద్దిసేపు విష్ణుమూర్తి మంత్రాన్ని పారాయణం చేసి చక్కెర పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయాలి.
నిర్జల ఏకాదశి రోజున తప్పకుండా పఠించాల్సిన మంత్రం ఇదే:
దేవదేవ్ హృషీకేష్ సంసారర్ణావతారక్॥
ఉద్కుమ్భప్రదేన్ నయ మాం పరమం గతిమ్ ॥
ఈ మంత్రాన్ని పఠిస్తూ శుద్ధమైన నీటిని ఒక పాత్రలో పేదలకు బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజున జంతువులకు పక్షులకు నీటిని ఆహారాన్ని పెట్టాల్సి ఉంటుంది.
Also read: CSK Vs GT Rain Updates: ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడి దెబ్బ.. పూర్తి సమీకరణలు ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook