Numerology: ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు! అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి
Numerology: న్యూమరాలజీ ప్రకారం, 5 వ తేదీన జన్మించినవారు చాలా అదృష్టవంతులు. చిన్నవయసులోనే అపారమైన సంపదకు యజమానులు అవుతారు. ఈ వ్యక్తులు వాక్ చాతుర్యంలో కూడా దిట్ట.
Numerology Prediction: జ్యోతిష్యశాస్తంలో న్యూమరాలజీ (Numerology) ఒక ముఖ్యమైన భాగం. ఇందులోని అంకెలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వ్యక్తి యొక్క రాడిక్స్ పుట్టిన తేదీ నుండి తెలుస్తుంది. రాడిక్స్ అనేది ఆ వ్యక్తి పుట్టిన తేదీ మొత్తం. ఏదైనా నెలలో 5, 14 మరియు 23 తేదీలలో జన్మించిన వ్యక్తికి రాడిక్స్ సంఖ్య 5 ఉంటుంది. ఉదాహరణకు మీరు 14వ తేదీన జన్మించినట్లయితే, 1+4=5 వస్తుంది. న్యూమరాలజీ ప్రకారం, 5 సంఖ్య గలవారు చాలా అదృష్టవంతులు. వీరు చిన్నవయసులోనే అంతులేని సంపదను పొందుతారు. రాడిక్స్ 5 గల వ్యక్తుల జీవితం గురించి తెలుసుకుందాం.
చిన్న వయస్సు నుండే సంపాదన..
రాడిక్స్ 5 గలవారు చాలా చిన్న వయస్సు నుండే డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారు. ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు. అంతేకాకుండా వాక్ చాతుర్యంలో దిట్ట. దీని వెనుక కారణం రాడిక్స్ 5 యొక్క అధిపతి మెర్క్యురీ. బుధ గ్రహం ఈ వ్యక్తులకు తర్కం, తెలివితేటలు, ప్రసంగ నైపుణ్యాలను ఇస్తుంది. అలాగే, ఈ వ్యక్తులు వ్యాపారం చేయడంలో నిష్ణాతులు. వీరు చిన్న వయస్సులోనే బలమైన బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు తక్కువ పెట్టుబడితో పెద్ద వ్యాపారం చేయగల సత్తా ఉన్నవారు.
సంగీతంలో గొప్ప ఆసక్తి
రాడిక్స్ 5 వ్యక్తుల సంగీతం పట్ల తీవ్ర ఆసక్తిని కలిగి ఉంటారు. వారు సంగీత వాయిద్యాలు వాయించడంలో లేదా సంగీతంలో మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఈ తమ తెలివితేటలు మరియు తర్కంతో ప్రతి సమస్యను సులువుగా పరిష్కరించగలరు. అలాంటి వారు పేదవారి ఇంట్లో పుట్టిన సరే...అంతులేని సంపదకు వారసులవుతారు.
(Note: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: Vastu Dosh Remedies for Home: ఇంటి వాస్తు దోషాలకు చెక్ పెట్టే సులభమైన మార్గాలు ఇవిగో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook