Vastu Dosh Remedies for Home: ఇంట్లోని వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతుండటం, ఆర్థిక పరిస్థితి దిగజారటం, పురోగతి లేకపోవడం, ధన నష్టం అధికంగా ఉండటం వంటివి జరిగితే దానికి వాస్తు దోషం (Vastu Dosh) కారణం కావచ్చు. దీనిని వెంటనే గుర్తించి తొలగించుకోవడం మంచిది. దీనికి వాస్తు శాస్త్రంలో (Vastu Shastra) సింపుల్ పరిహారాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
వాస్తు దోషాలకు చెక్ పెట్టే మార్గాలు:
>> ఇంట్లోని వ్యక్తుల పురోగతిలో అడ్డంకులు ఉంటే.. ప్రతికూల శక్తి పెరిగిందని అర్థం. అప్పుడు ఇంటి ఈశాన్య మూలలో పక్షులు, నదులు లేదా ఉదయించే సూర్యుని చిత్రాన్ని ఉంచండి. అలాగే, ఈ మూలను శుభ్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల త్వరితగతిన పురోభివృద్ధి, ధనలాభం కలుగుతాయి.
>> వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది సరైన దిశలో ఉండటం, అలాగే నీరు, గ్యాస్ స్టవ్, ఫ్రిజ్, డైనింగ్ మొదలైన వాటిని సరైన స్థలంలో ఉంచడం చాలా ముఖ్యం. అలా కాకపోతే ఇంటిలోని వ్యక్తుల ఆరోగ్యం, ఆదాయం మొదలైన వాటిపై ప్రభావం చూపుతుంది. వంటగదికి సంబంధించిన అన్ని వాస్తు దోషాలను తొలగించడానికి, కిచెన్ లో ఫైర్ యాంగిల్‌లో ఎర్రటి బల్బును ఉంచి దానిని వెలిగించండి. ఇది వంటగది యొక్క వాస్తు దోషాల దుష్ప్రభావాలను తొలగిస్తుంది.
>> ఇంటి పశ్చిమ భాగంలో ఏదైనా దోషం ఉంటే.. అక్కడ శని యంత్రాన్ని అమర్చండి మరియు కొద్ది రోజుల్లో దాని ప్రభావాన్ని చూడండి.
>> గాలులు వీచే దిశలో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి, హనుమంతుని ఫోటోను ఈ దిశలో ఉంచండి. అలాగే ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి. అంతేకకాకుండా ఈ ప్రదేశంలో అక్వేరియం ఉంచడం లేదా ప్రతిరోజూ తాజా పువ్వుల గుత్తిని ఉంచడం ద్వారా కూడా సమర్థవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది.
>> ఇంటి ప్రధాన ద్వారంపై గణపతి బొమ్మను పెట్టడం వల్ల అనేక వాస్తు దోషాలకు పరిష్కారం లభిస్తుంది. ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది.
>> ఇంటికి తూర్పు దిక్కున ఉన్న వాస్తు దోషం తొలగిపోవాలంటే ఈ దిశలో సూర్యుని చిత్రాన్ని లేదా 7 గుర్రాల రథాన్ని అధిరోహిస్తున్న సూర్యభగవానుని చిత్రాన్ని ఉంచండి. అలాగే ఈ దిశలో వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేయండి. ఇది చాలా త్వరగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook