Numerology : ఈ ర్యాడిక్స్ కలిగిన పిల్లలు చాలా లక్కీ.. వీరి పుట్టుకతో ఇంటి జాతకమే మారిపోతుంది...
Numerology Predictions: న్యూమరాలజీ ప్రకారం ర్యాడిక్స్ 7 కలిగిన పిల్లలు చాలా లక్కీ.. ఎంత లక్కీ అంటే...
Numerology Predictions: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, రాశులను బట్టి వ్యక్తి జాతకం చెప్పినట్లు న్యూమరాలజీలో వ్యక్తి ర్యాడిక్స్‌ను బట్టి అతని స్థితి గతులను చెబుతారు. న్యూమరాలజీ ప్రకారం 1 నుంచి 9 వరకు ఉండె అంకెలు నవగ్రహాలను సూచిస్తాయి. న్యూమరాలజీలో ఒక్కో ర్యాడిక్స్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ర్యాడిక్స్ 7 చాలా లక్కీగా పరిగణించబడుతుంది. ర్యాడిక్స్ 7 కలిగిన పిల్లలు చాలా అదృష్టవంతులని న్యూమరాలజీ నిపుణులు చెబుతారు.
ర్యాడిక్స్ 7 :
ఏదేనినెలలో 7, 16 లేదా 25 తేదీల్లో పుట్టిన పిల్లలకు ర్యాడిక్స్ నంబర్ '7'గా ఉంటుంది. ఈ ర్యాడిక్స్ కలిగినవారికి జీవితంలో అపారమైన సంపద, అనేక విజయాలు సొంతమవుతాయి. సాధారణంగా ఈ ర్యాడిక్స్ కలిగినవారు చాలా అదృష్టవంతులని చెబుతారు. వీరు చేపట్టే ఏ పనైనా సులువుగా పూర్తవుతుంది. పెద్ద కష్టపడకుండానే తమకున్న తెలివి తేటలతో సమాజంలో ఉన్నత స్థాయికి చేరుతారు. ర్యాడిక్స్ 7 కలిగిన వ్యక్తులు ఒత్తిడిలో జీవించలేరు. స్వేచ్ఛగా జీవించేందుకే ఇష్టపడుతారు.
ఇంటికే అదృష్టం :
ర్యాడిక్స్ 7 నంబర్ కలిగిన పిల్లలు తమ ఇంటికి కూడా అదృష్టం తీసుకొస్తారు. వారు పుట్టిన వెంటనే ఆ ఇంటి ఆర్థిక స్థితి గతులు మారిపోతాయి. ప్రేమ, గౌరవాన్ని పొందుతారు. ఈ వ్యక్తుల స్వచ్ఛమైన హృదయం, స్వభావం అందరినీ ఆకర్షిస్తుంది. అందరిలో వీరి పట్ల మంచి గౌరవం, మర్యాద, ఇష్టం ఏర్పడుతాయి. ఈ వ్యక్తులు సమాజంలో తమకంటూ సొంత ముద్ర ఏర్పరుచుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలోనూ సక్సెస్ అవుతారు. ఏ రంగంలో ఉన్న సరే ఉన్నత స్థితికి చేరుకోగలరు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read: పాకిస్తాన్ అభిమానులను చితకబాదిన అఫ్గానిస్థాన్ ఫాన్స్.. టీమిండియా ఫాన్స్ ఫుల్ ఖుషి!
Also Read: Ganesh Immersion 2022: హైదరాబాద్ లో ఈ రూట్లు పూర్తిగా బంద్.. గణేష్ శోభాయాత్రతో రెండు రోజులు ఆంక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook