October Horoscope 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి అమితమైన ప్రాధాన్యత ఉంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని నమ్మకం. ఎందుకంటే ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుందనేది జ్యోతిష్యులు చెబుతున్న మాట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది అక్టోబర్ నెల అన్ని రాశులకు ప్రత్యేకమే అయినప్పటికీ ముఖ్యంగా 4 రాశులవారికి అత్యంత శుభప్రదం కానుంది. లక్ష్మీదేవి కటాక్షంతో ఎనలేని సంపదలు కలుగుతాయి. అపారమైన ధనవర్షం కురుస్తుంది. అక్టోబర్ నెలలో ఈ రాశులకు ఊహించని లాభాలు కలగనున్నాయి. కెరీర్ విషయంలో అయితే వెనుదిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మంచి పదవి లభించడమే కాకుండా సమాజంలో లేదా పనిచేసేచోట గౌరవ మర్యాదలు అందుకుంటారు. 


వృశ్చిక రాశి జాతకులకు అక్టోబర్ నెల పూర్తిగా సానుకూలంగా ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. ఈ నెలలో ఈ రాశి జాతకులు ఇళ్లు-భూమి వంటి స్థిరాస్థులు కొనుగోలు చేయవచ్చు. కొత్త వాహనం కొనే యోగం ఉంటుంది. జీవితంలో చాలా సవాళ్లు ఎదుర్కోవల్సి వచ్చినా అన్నింటిలో విజయం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఏ సమస్యా తలెత్తదు. ఉద్యోగ మార్పు ఉండవచ్చు వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. 


ధనస్సు రాశి జాతకులకు అక్టోబర్ నెల చాలా శుభదాయకంగా ఉంటుంది. ఈ నెలలో అన్నీ ఆశించినట్టు జరుగుతాయంటారు. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. వ్యాపారం విస్తృతం కావచ్చు. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలుంటాయి. డబ్బులు సంపాదించే మార్గాలు పెరుగుతాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. విదేశీయానం ఉండవచ్చని అంటారు. 


అక్టోబర్ నెల అన్ని రాశులకు ప్రత్యేకమైనట్టే మేష రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ నెలలో ఉద్యోగులు, వ్యాపారులు అమితమైన వృద్ధి సాధిస్తారు. కెరీర్ విషయంలో చాలా బాగుంటుంది. కోరుకున్న ఉద్యోగం లభించవచ్చు. ఖర్చుల్ని నియంత్రించగలిగితే ఆర్ధికంగా చాలా బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.


అక్టోబర్ నెల సింహ రాశి జాతకులకు అదృష్టంగా మారనుంది. ఎందుకంటే ఈ నెలలో వ్యాపారులు ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగ మార్పు మీకు లాభం చేకూర్చనుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిని కలిగి ఉంటారు. 


Also read: Chaturgrahi Yog 2023: తులరాశిలో చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook