Offer Things To Shivling: ఆషాఢమాసం తర్వాత శ్రావణమాసం ప్రారంభంకానుంది. ఈ శ్రావణ మాసం జూలై 14 నుంచి ఆరంభమవుతుంది. ఈ మాసంలో చాలా భారతీయులు శివున్ని ఆరాధిస్తారు. మహా శివున్ని ప్రత్యేకంగా పూజించడం వల్ల సకల శుభాలు పొందుతారని నమ్మకం. అయితే శివ పూజలో భాగంగా స్వామి వారికి పలు రకాల ఆకులు, పూలు సమర్పిస్తే.. వరాలను అందిస్తాడాని పలు భక్తి శాస్త్రాల్లో వివరించారు. అంతేకాకుండా సకల శుభాలు పొంది.. సంతోషం కలిగి కోరికలన్నీ నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రావణమాసంలో స్వామిని వీటితో పూజించాలి:


బిల్వ పత్రాలు:


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శ్రావణమాసంలో బిల్వ పత్రాలతో మహా శివున్ని పూజించడం వల్ల అనుగ్రహం కలుగుతుందని పేర్కొంది. ఈ మాసంతో ప్రతి సోమవారం పూజ సమయంలో శివలింగంపై బిల్వ ఆకులను సమర్పించండి. ఇలా క్రమం తప్పకుండా బిల్వ పత్రాన్ని సమర్పించే వారి కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది.


కుంకుమపువ్వు:


శివుని ఆరాధించి అనుగ్రహం పొందడానికి శ్రావణమాసం ప్రత్యేక సమయం. శివలింగంపై కుంకుమ సమర్పించడం వల్ల మనిషికి అదృష్టం లభిస్తుందని శాస్త్రం తెలుపుతుంది. అలాగే శివునికి పంచదారతో అభిషేకం చేయడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని పేర్కొంది.


జమ్మి ఆకులు:


ఉపవాసంతో శ్రావణమాసంలో మహా శివున్ని పూజించడం వల్ల పాపాలు నశిస్తాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతోంది. అంతేకాకుండా ఈ సమయంలో స్వామి వారికి జమ్మి ఆకులను కూడా సమర్పిస్తే.. శివుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం పేర్కొంది.


పాలు, గంగాజలంతో అభిషేకం:


పెళ్లికాని అమ్మాయిలు సోమవారం ఉపవాసం ఉండి శివ లింగాన్ని పూజిస్తే.. అమ్మాయిలకు తగిన వరుడు లభిస్తాడని శాస్త్రం తెలుపుతోంది. అంతేకాకుండా పెళ్లైన అమ్మాయిలకు  వైవాహిక జీవితం పొందుతారు. అయితే ఇవిన్ని కలగాలంటే శివ లింగానికి ప్రతి సోమవారం  గంగాజలంతో అభిషేకం చేయాలని శాస్త్రం చెబుతోంది.


సువాసన, తాజా పువ్వులు:


 శివుడిని చాలా మంది భారతీయులు మహాదేవ్ అని కూడా అంటారు. దేవతలందరిలో పరమశివుడు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటాడని నమ్ముతారు. గ్రంధాల ప్రకారం.. పరమశివుడికి కన్నెర పువ్వులంటే చాలా ఇష్టం. పూజ సమయంలో శివుడికి కన్నెర్ పువ్వులతో పూజ చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది.


Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా


Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook