Spiritual: హిందూ సంప్రదాయంలో చెట్లను పూజించే సంప్రదాయం ఉంది. కొన్ని చెట్లను పూజించడం వల్ల సంతానం, సంపద, ఉద్యోగప్రాప్తి కలుగుంది. ఇందులో రావిచెట్టుకు ఒకటి. మనసంప్రదాయంలో రావిచెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టును పూజించడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు, రావిచెట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తారని నమ్ముతారు. అంతేకాదు ఆ ఇంట సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలు..
మీ వివాహానికి ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే ప్రతిరోజూ రావి చెట్టు వేరుకు పసుపు, పాలు సమర్పించండి. రావిచెట్టుకు పాలు నైవేద్యంగా పెట్టడం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ శివుని ఆశీస్సులు ఉంటాయి. మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. 


ఇదీ చదవండి:  ఈ 5 రాశులవారు తమ భావొద్వేగాలను బయటకు కనిపించనివ్వరు.. మీ రాశి కూడా ఇదేనా?


పెరుగు..
రావిచెట్టుకు పాలతోపాటు పెరుగును కూడా నైవేద్యంగా పెడతారు. అయితే, పెరుగును సోమవారం నాడు మాత్రమే సమర్పించాలని గుర్తుంచుకోవాలి. ఇలా రావిచెట్టుకు పెరుగు పెట్టడం వల్ల మీరు కోరిన కోరికలన్ని నెరవేరుతాయి. 


నువ్వులు..
రావిచెట్టుకు నువ్వులు లేదా నువ్వులతో తయారు చేసిన లడ్డూను సమర్పించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలన్ని సఫలమవుతాయి. చదువు, ఉద్యోగాలు, ప్రమోషన్ త్వరగా వస్తుంది.


చందనం..
రావిచెట్టుకు ఎర్రచందనం సమర్పించడం వల్ల మంగళ దోషం నుండి బయటపడవచ్చు. ఈ దోషం ఉన్నవారు పెళ్లి ఆలస్యం కావడం, వైవాహిక సమస్యలు రావు. రావిచెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. రావిచెట్టును పూజించడం వల్ల ముక్కోటి దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు. 


ఇదీ చదవండి: వైష్ణోదేవి ఆలయం సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ, ఇవి ఉంటేనే వెళ్లగలరు..


కుంకుమ..
అంతేకాదు రావిచెట్టుకు కుంకుమను నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మంచిది. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో గ్రహదోషాలు తొలగిపోతాయి. రావిచెట్టు మొదళ్లలో కుంకుమను సమర్పించడం వల్ల మంగళదోషాలు తొలగిపోతాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook