Palmistry: హస్తసాముద్రికం ద్వారా ఎవరు ధనవంతులవుతారు, ఎవరు నిరుపేదలుగా ఉంటారనేది తెలుసుకోవచ్చు. ఎవరికి సులభంగా సంపద లభిస్తుంది..ఎవరికి లభించదనేది కూడా తెలిసిపోతుంది..ఆ వివరాలు పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చేతిరేఖల ఆధారంగా జాతకం చెప్పేదే హస్త సాముద్రికం. జ్యోతిష్యశాస్త్రంలో దీనికో విశేష ప్రాధాన్యత ఉంది. దీని ఆధారంగా వ్యక్తి స్వభావం నుంచి భవిష్యత్ వరకూ సులభంగా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. దీనికోసం చేతి రేఖలు, గుర్తులు, ఆకృతుల్ని విశ్లేషిస్తారు. దీనిద్వారా వ్యక్తి జీవితంలో అంతులేని సంపద, విజయం, గౌరవం లేదా ఎవరు పేదరికంలో గడపవల్సి వస్తుందనేది తెలుసుకోవచ్చు. ఇవాళ హస్తరేఖల ద్వారా ఆ వివరాలు తెలుసుకుందాం..


ఎవరి చేతిలో అయితే..గురు పర్వతంపై వృత్త చిహ్నం ఉంటుందో..వారి జీవితంలో అంతులేని సంపద వచ్చి పడుతుంది. వీరంతా తమ ప్రయత్నాల ద్వారా డబ్బులు సంపాదిస్తారు. అదే సమయంలో అత్తవారి తరపు నుంచి ధన సంపద లభిస్తుంది. వీరికి కెరీర్ పరంగా మంచి ఉన్నతి లభిస్తుంది. 


అత్తవారి తరపు నుంచి సంపద లభించేందుకు చేతి రేఖలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరి చేతిలో అయితే శని పర్వతంపై వృత్తం ఉంటుందో..వారికి ఆకస్మిక ధనం లభిస్తుంది. ఈ సంపదంతా అత్తారింటి నుంచి వస్తుంది. లేదా లాటరీ వంటి పద్ధతుల ద్వారా ధనలాభం కలుగుతుంది. పెట్టుబడులు ద్వారా సంపద వస్తుంది. 


చేతిలో కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో వృత్తం గుర్తు ఉంటే చాలా మంచిదంటారు. గురు, శని పర్వతం కాకుండా సూర్య పర్వతంపై వృత్తం చిహ్నం ఉన్నా...చాలా లాభాలు కలుగుతాయి. ఇలాంటివారికి అంతులేని సంపద లభిస్తుంది. అదే సమయంలో కీర్తి కూడా లభిస్తుంది. తమ తమ పనుల కారణంగా లబ్ది చేకూరుతుంది.అటు చంద్ర పర్వతంపై వృత్త చిహ్నం ఉంటే..ఆరోగ్యం క్షీణిస్తుంది. అటు బుధ పర్వతంపై వృత్త చిహ్నముంటే..వ్యాపారంలో భారీ లాభాలుంటాయి. ఇలాంటివారికి వ్యాపారంలో అంతులేని డబ్బులు వస్తాయి.


Also read: Vastu Tips for Agarbatti: పూజ చేసేటప్పుడు అగరబత్తీలు వెలిగిస్తున్నారా? అయితే కష్టాలను కోరి తెచ్చుకున్నట్లే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook