If you have these lines in your hand, You must get government job: హిందూ సంప్రదాయాల ప్రకారం.. జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొందరు గవ్వలు, కార్డ్ వేసి జాతకం చెబితే.. మరి కొందరు  మొహం, చేతి రేఖలను చూసి చెప్పేస్తుంటారు. చేతి రేఖలను బట్టే మన తలరాత ఉంటుందని ఈ ప్రపంచంలోని చాలా మంది నమ్ముతుంటారు. మన చేతి రేఖలను బట్టి ఆరోగ్యం, విద్య, వైవాహిక జీవితం, పిల్లలు, జీవిత కాలం, ఆర్థిక పరిస్థితి లాంటివి జ్యోతిష్యులు (హస్తసాముద్రికులు) అంచనా వేసి చెప్తుంటారు. ఇక చేతిలో ఈ రేఖ ఉంటే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తారట. ఆ రేఖ ఏంటో ఓసారి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉన్న వ్యక్తులు సాధారణంగా వారి చేతుల్లో కొన్ని ప్రత్యేక గుర్తులు కలిగి ఉంటారు. లేదా వారి జాతకంలో సూర్యుడు చాలా బలంగా ఉంటాడు. హస్తసాముద్రికం ప్రకారం ఎవరైనా చేతిలో సూర్య రేఖ.. గురు పర్వతం వైపునకు వెళ్తే వారికి ప్రభుత్వ ఉద్యోగం యోగం ఉంటుంది. అంతేకాదు పెద్ద ప్రభుత్వాధికారి అవుతారు. సూర్య పర్వతం నుంచి అదృష్ట రేఖ కిందకు పడిపోయినట్లుగా ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారట. 


తమ చేతులలో ఉంగరపు వేలు కింద ఉన్న సూర్య పర్వతం, అలాగే సూర్య పర్వతం నుంచి సరళ రేఖ ఉద్భవించినట్లయితే.. అలాంటి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగం పొందుతారు. కెరీర్ ప్రారంభంలో వీరు ప్రైవేట్ రంగంలోకి వెళితే.. కొంతకాలం తర్వాత మనసు మార్చుకుని ప్రభుత్వ రంగంలో చేరతారు. గురు పర్వతం పైకి ఉన్నవారు అదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతారు. ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. సులభంగా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు లభిస్తాయి. వారు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. విధి రేఖ నుంచి ఒక రేఖ ఉద్భవించి సూర్య పర్వతాన్ని కలిసినట్లయితే.. అలాంటి వ్యక్తి కూడా చాలా అదృష్టవంతుడు. 



 


హస్తసాముద్రికం ప్రకారం ఏ వ్యక్తి చేతిలోనైనా బొటన వేలుపై చక్రం గుర్తు ఉంటే.. వారు చాలా అదృష్టవంతులవుతారు. అలాంటి వారు సకాలంలో అనుకున్న పని పూర్తి చేస్తారు. అంతేకాకుండా ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మరోవైపు బుధ పర్వతంపై త్రిభుజాకరం చిహ్నం ఉన్నట్లయితే అలాంటి జాతకులు ఉన్నత స్థానాన్ని పొందుతారు. వారికి డబ్బుతో పాటు పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇక ఆలస్యం ఎందుకు.. ఆ రేఖ మీ చేతిలో ఉందో లేదో ఓసారి చూస్కోండి.


Also Read: Kane Williamson Covid: కేన్‌ విలియమ్సన్‌కు కరోనా.. రెండో టెస్టు నుంచి అవుట్‌! కెప్టెన్ ఎవరంటే


Also Read: TS Intermediate Results 2022: ఈ వారంలోనే.. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook