Panchagrahi yog in tula rashi 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒకే రాశిలో రెండు గ్రహాలు కలిసినప్పుడు ఏదైనా యోగం ఏర్పడుతుంది. మూడు రోజుల కింద గ్రహాల రాకుమారుడు బుధుడు తులరాశిలో సంచరించాడు. అప్పటికే తులరాశిలో సూర్యుడు, శుక్రుడు, చంద్రుడు, కేతువు ఉన్నారు. తులరాశిలో ఇవన్నీ కలిసి పంచగ్రాహి లేదా పంచగ్రహ రాజయోగాన్ని (Panchagrahi yog) ఏర్పరుస్తున్నాయి. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ రాజయోగం వల్ల 4 రాశులవారికి అపారమైన సంపదను ఇస్తాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): పంచగ్రహి రాజయోగం మేషరాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరాశి యెుక్క ఏడో ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశివారి వైవాహిక జీవితం బాగుంటుంది. పెళ్లికాని యువతీయువకులకు వివాహ ప్రతిపాదన రావచ్చు. పార్టనర్ షిప్ తో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. తద్వారా మీరు భారీగా లాభాలను ఆర్జిస్తారు.
మిథునం (Gemini): రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన బుధ గ్రహం తన మిత్రుడితో కలిసి ఐదవ ఇంట్లో ఉన్నాడు. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. విద్యార్థులకు ఈ సమయం కలిసి వస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ టైం శుభప్రదంగా ఉంటుంది. 


మకరం (Capricron): పంచగ్రహి రాజయోగం వృత్తి, వ్యాపారాల్లో విజయాన్నిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో శనిదేవుడు శష రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. అలాగే మీ సంచార జాతకంలో ఏడు గ్రహాలు కేంద్ర స్థానంలో ఉన్నాయి. దీంతో మీ కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చి ప్రతిపనిలోనూ విజయం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. 
కుంభం (Aquarius):  రాజయోగం ఏర్పడటంతో మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. వ్యాపారులు కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


Also Read: Surya Gochar 2022: ధనస్సు రాశిలోకి సూర్యభగవానుడు... ఈ 5 రాశుల వారిని వరించనున్న అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి