Paush Amavasya 2022: పుష్య అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
Paush Amavasya 2022: హిందూమతంలో పుష్య అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల మీకు శుభఫలితాలు కలుగుతాయి.
Paush Amavasya 2022 Date: ఈ సంవత్సరం చివరి అమావాస్య 23 డిసెంబర్ 2022న వస్తుంది. దీనినే పౌష అమావాస్య లేదా పుష్య అమావాస్య అంటారు. హిందూమతంలో పుష్య మాసం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం పూర్వీకులకు అంకితం చేయబడింది. ఈరోజున పూర్వీకుల పేరుతో దానం చేయడం వల్ల వారు భువి నుంచి వైకుంఠానికి వెళతారని నమ్ముతారు.
ప్రాముఖ్యత
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పౌష అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల మీరు పితృదోషం మరియు కాలసర్ప దోషాల నుండి విముక్తి పొందుతారు.ఈరోజున పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. మతపరమైన పనులకు పుష్యమాసం చాలా ముఖ్యమైనది. ఈనెలంతా సూర్యుడిని ఆరాధించడం వల్ల మీకు శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజున పూర్వీకులు నైవేద్యాలు సమర్పించడం వల్ల మీరు వారి అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.
పూజా విధానం
ఉదయాన్నే గంగాస్నానం చేసి రాగి పాత్రలో మందార పువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత పూర్వీకుల శ్రాద్ధ కర్మలు చేసి.. మీ శక్తి మేరకు దానం చేయండి. ఈరోజున పీపుల్ (రావి) చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా ప్రయోజనం పొందుతారు. ఈ రోజున చేపలకు పిండిని తినిపించడం శుభప్రదంగా భావిస్తారు.
అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పని చేయకండి.
1. ఎవరినీ అగౌరవపరచకూడదు.
2. అబద్ధం చెప్పకూడదు.
3. రాత్రిపూట ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకూడదు.
4. మద్యం, మాంసాహారం తీసుకోకూడదు.
Also Read: Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రులు ప్రారంభం ఎప్పుడు? దీని విశిష్టత ఏంటో తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి