Peacock Feather Benefits For Your Home: నెమలి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. నెమలి మాత్రమే కాకుండా నెమలి పించం కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఈ పించం ఎప్పటి నుంచో ఆకట్టుకుంటూ వస్తోంది. నెమలి పించంలో ఉండే నీలం, ఆకుపచ్చ, బంగారం వంటి రంగులు దీనిని మరింత అందంగా కనిపిస్తాయి. అయితే నెమలి పించాన్నికి మన సంస్కృతిలో ఎంతో ప్రముఖ్యత ఉంది. దీని శుభ చిహ్నంగా భావిస్తారు. ఇది దుష్ట శక్తులను తొలగించి అదృష్టాన్ని తెస్తుందని చాలా మంది భావిస్తారు. అయితే కొంతమంది నెమలి పించాన్ని ఇంట్లో ఉంచుతుంటారు. దీని కొంతమంది హోం డెకరేషన్ కోసం పెడుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెమలి పించం ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా? దీని వల్ల కలిగే శుభ లాభాలు గురించి మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తు శాస్త్రం ప్రకారం, నెమలి పించాన్ని ఇంట్లో ఉంచడం వల్ల శుభం కలుగుతుందని నిపుణులు చెబుతన్నారు. అనేక సంస్కృతులలో ఇది ఒక శుభ చిహ్నంగా భావిస్తారు. వాస్తు నిపుణుల ప్రకారం నెమలి పించాన్ని లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తారు. దీని ఇంట్లో ఉంచడం వల్ల దిన దిన ధనవృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా నెమలి పించం ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుందని పాజిటివ్‌ శక్తులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు. నెమలి పించం ఇంట్లో ఉంచడం వల్ల మనసుకు ప్రశంతత కలుగుతంది. అలాగే వాస్తు నిపుణుల ప్రకారం నెమలి పించం ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ఆరోగ్య సమస్యలు ఉండవని భావిస్తారు. అంతేకాకుండా భార్య భర్తల మధ్య ప్రేమను పెంచుతుందని చెబుతున్నారు. 


నెమలి పించాన్ని ఉంచడానికి అనువైన దిశలు:


నెమలి పించాన్ని ఇంట్లో ఉంచడం వల్ల శుభం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే, దీన్ని ఏ దిశలో ఉంచాలి అన్నది చాలా ముఖ్యం. వాస్తు నిపుణుల ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడు. ఆ స్థానంలో నెమలి పించం ఉంచడం వల్ల ధనవృద్ధి ఉంటుందని చెబుతున్నారు.  అలాగే ఈశాన్య దిశగా ఉంచడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందని అంటున్నారు. నెమలి పించంను ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి. దీని వల్ల ఇంట్లో శాంతి ఉంటుంది. అలాగే దీన్ని ఎంతో గౌరవంగా చూడాలి. ఎక్కడ పడితే ఎక్కడ పడేకుండా చూసుకోవాలి. నెమలి పించం ను పూజ గదిలో ఉంచడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 


ఇదీ చదవండి:  Remedies To Attract Money: ఇంట్లో డబ్బు నిలవడం లేదా? ఇలా చేయండి లక్ష్మి తాండవం చేస్తుంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.