Pinky Finger: మీరెలాంటి వారో మీ చిటికెన వేలు చెప్పేస్తుంది.. ఎలాగో తెలుసా...
Pinky Finger Reveals Your Personality: చేతిలో రేఖలను చూసి జాతకం చెప్పినట్లే... చిటికెన వేలు పొడవును బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చునట...
Pinky Finger Reveals Your Personality: చిటికెన వేలును చూసి మీ వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చట. చిటికెన వేలు ఉంగరం వేలి ఎగువ కట్టు కన్నా కన్నాపెద్దగా ఉందా.. చిన్నగా ఉందా.. సమానంగా ఉందా... ఈ మూడింటి ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చట. ఇంతకీ ఈ మూడింటిలో మీరు ఏ కేటగిరీలోకి వస్తారు.. మీ చిటికెన వేలు మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోందో ఇక్కడ తెలుసుకోండి..
మీ ఉంగరం వేలి ఎగువ కట్టుకు మీ చిటికెన వేలు సమానంగా ఉంటే.. :
సాధారణంగా మన చేతి వేళ్లకు మూడు కట్లు కనిపిస్తాయి. ఎగువ కట్టు, మధ్య కట్టు, దిగువ కట్టు ఉంటాయి. చిటికెన వేలు ఉంగరపు వేలి ఎగువ కట్టుకు సమానంగా ఉన్నట్లయితే.. ఆ వ్యక్తులు జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారు. జీవితంలో ప్రతీది ఒక క్రమ పద్దతి ప్రకారం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. ఏ నిర్ణయమైనా అన్ని కోణాల్లో ఆలోచించాకే తీసుకుంటారు. లక్ష్యాలకు కట్టుబడి ముందుకెళ్తారు.
చిటికెన వేలు ఉంగరపు వేలి ఎగువ కట్టు కన్నా దిగువకు ఉంటే
ఇలాంటి వ్యక్తులు సెంటిమెంటల్ అని చెప్పొచ్చు. భావోద్వేగాల పట్టింపు ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తుల పట్ల చాలా సున్నితంగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులకు దూరంగాఉంటారు. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులను క్షమిస్తారేమో గానీ ఆ మోసాన్ని ఎన్నటికీ మరిచిపోరు. ఇతరుల పట్ల ఎప్పుడూ దయాగుణం, సేవాగుణంతో ఉంటారు. ఎవరైనా ఎదురుపడితే చిరునవ్వుతో పలకరిస్తారు. మీ వ్యక్తిత్వం, నైతికత మీకు పెద్ద బలం.
చిటికెన వేలు ఉంగరపు వేలి ఎగువ కట్టు కన్నా పెద్దగా ఉంటే..
ఈ వ్యక్తులు తమ ప్రియమైన వ్యక్తుల కోసం ఏమైనా చేస్తారు. ఎప్పుడూ ఎవరికైనా సాయం చేయడమే తప్ప ఎవరి నుంచి ఏమీ ఆశించరు. హేతుబద్దంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. ఏ విషయంలోనూ తొందరపడరు. మీకు సంతోషాన్నిచ్చే పనే చేస్తారు. అది సరైనదనకుంటే.. అందులో సంతృప్తి ఉందంటే చేయడానికి వెనుకాడరు. మీ పట్ల మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తిగా మీ ప్రవర్తన, వ్యవహార శైలి అందరినీ ఆకర్షిస్తుంది.
Also Read: Bigg Boss Telugu 6 Elimination: ఆ ఇద్దరు భామల మీద ఎలిమినేషన్ కత్తి..ఒకరు కన్ఫాం!
Also Read: Weight Loss Tips: బరువు తగ్గడంలో అరటి పండ్లు సహాయపడుతాయా?.. ఈ విషయం తెలుసుకోండి!