Pitru Paksha Dreams: పితృ పక్షం మెుదలైంది. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకులకు శ్రాద్ధం చేయడం  ద్వారా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి ఆశీర్వాదంతో లైఫ్ లో ఎలాంటి కష్టాలు లేకుండా గడపవచ్చని ఆశిస్తారు. చనిపోయిన కుటుంబీకులతో మనకు చాలా సాన్నిహత్యం ఉంటుంది. దీంతో మనం వారిని త్వరగా మరచిపోలేం. దాంతో వారు అప్పడప్పుడూ కలలోకి వస్తుంటారు. అయితే పితృ పక్ష (Pitru Paksha 2022) సమయంలో చనిపోయిన పూర్వీకులు కలలోకి రావడం అనేక అర్థాలను సూచిస్తుంది. అవేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పితృ పక్షంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. ఈ 15 రోజులు పూర్వీకులకు ఆత్మకు శాంతి కలగాలని శ్రాద్ధం, తర్పణం, పిండ దానం, పేదలకు ఆహారం ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ సమయంలో మరణించిన బంధువులు కలలో కనిపిస్తే... అందులో అనేక రకాల సంకేతాలు దాగి ఉన్నాయని తెలుసుకోండి. 


ఈ కలలకు అర్థాలు ఏంటంటే...
పితృ పక్షం సమయంలో పూర్వీకులు అనారోగ్యంతో లేదా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నట్లు కలలో కనిపిస్తే, వారి ఆత్మకు శాంతి కలగలేదని అర్థం. అటువంటి పరిస్థితిలో తర్పణం, శ్రాద్ధం, దానధర్మాలు చేయాలి. ఒక వేళ పూర్వీకులు కలలో సంతోషంగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తే, వారి ఆత్మకు శాంతి లభించిందని అర్థం. పితృ పక్షం సమయంలో జీవించి ఉన్న వ్యక్తి కలలో కనిపిస్తే, అతని జీవితం చాలా కాలం పాటు కొనసాగుతుందని అర్థం.


Also Read: Mahalaya Amavasya 2022: మహాలయ అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook