Pitru Paksha 2022 Significance: శ్రాద్ధం లేదా పితృ పక్షం సమయంలో శుభ కార్యాలు చేయడం నిషిద్ధం. పితృ పక్షం లేదా శ్రాద్ధ పక్షం (Pitru Paksha 2022) ఈరోజు అంటే సెప్టెంబర్ 10 నుండి ప్రారంభమవుతుంది. అయితే దీనికి రెండు రోజుల ముందు అంటే సెప్టెంబరు 8 నుండి పంచకం (Panchak 2022) ప్రారంభమైంది. హిందూ మతం ప్రకారం, పితృ పక్షం మరియు పంచకాల సమయాల్లో ఎటువంటి శుభకార్యాలు జరుగవు. ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే అశుభఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాబోయే 15 రోజుల పాటు గృహ ప్రవేశం, గృహ-వాహన-నగలు కొనుగోలు, క్షవరం, వివాహం, కొత్త పనులు ప్రారంభించడం వంటి శుభ కార్యాలు చేయకండి. ఎందుకంటే రావణుడు పంచకాల సమయంలోనే చంపబడ్డాడు. కాబట్టి ఎవరైనా పంచకాల సమయంలో మరణిస్తే దానిని అశుభంగా పరిగణిస్తారు. అందుకే పంచకాల సమయంలో మరణించిన వారి అంత్యక్రియలు ప్రత్యేక ఆచారాలతో చేస్తారు. మరోవైపు, పితృ పక్షం లేదా శ్రాద్ధ సమయం అంటే పూర్వీకులను గౌరవించడం, వారి ఆత్మకు శాంతి చేకూర్చడం. కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు జరుపుకోవడం సరికాదు.  


ఈ పనులు చేయవద్దు 
>> కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవద్దు.
>> పంచకాల సమయంలో ఇంటి పైకప్పు వేయడం, చెక్క వస్తువులను కొనుగోలు చేయడం చేయవద్దు
>> తామసిక ఆహారం తీసుకోవద్దు. ముఖ్యంగా  వెల్లుల్లి, ఉల్లి, మాంసాహారం వంటివి తినవద్దు. మద్యం, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండండి. 
>> గడ్డం తీయడం, జుట్టు కత్తిరించుకోవడం, అందానికి సంబంధించిన వస్తువులు కొనడం కూడా మంచిది కాదు.
>> కొత్త బట్టలు, నగలు, కారు, ఇల్లు మొదలైనవి కొనకూడదు లేదా బుక్ చేయకూడదు.


Also Read: Budh Vakri Effect 2022: కన్యారాశిలో బుధుడి తిరోగమనం... ఏ రాశివారికి లాభం? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook