Pitru Paksha 2022, Pind Daan: గణేష్ ఉత్సవాలు ముగిసిన వెంటనే పితృ పక్షం ప్రారంభమవుతుంది. ఇది (Pitru Paksha 2022) ఈ సంవత్సరం సెప్టెంబరు 10 నుండి ప్రారంభమై... సెప్టెంబరు 25న సర్వపితృ అమావాస్యతో ముగుస్తుంది. ఈ 15 రోజులు చనిపోయిన పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధం, పిండ ప్రధానం చేస్తారు. పితృ పక్ష సమయంలో పూర్వీకులు భూలోకానికి వస్తారని నమ్ముతారు. అంతేకాకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని శ్రాద్ధం చేయడం ద్వారా పూర్వీకుల సంతోషించి వారి వారి కుటుంబాలను ఆశీర్వదిస్తారు. గరుడ పురాణంలో మరణానంతరం పిండ దానానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. అసలు పిండ దానం లేదా పిండ ప్రదానం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిండ దానం ఎందుకు చేస్తారు?
గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆత్మ 13 రోజుల పాటు అతని కుటుంబంతోనే ఉంటుంది. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ 10 రోజులలో తిరిగి శరీరంలోకి ప్రవేశించాలని కోరుకుంటుంది. ఈ సమయంలో చనిపోయిన పూర్వీకులు ఆకలిదప్పికలతో బాధపడతారు. ఈ పది రోజులపాటు పిండ దానాన్ని చేయడం ద్వారా వారి ఆత్మ సంతృప్తి చెందుతుంది. చనిపోయిన వ్యక్తికి కుటుంబ సభ్యులు పిండ ప్రదానం చేయకపోతే ఆ వ్యక్తి ఆత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. 13వ రోజున యమదూతులు ఆత్మను పట్టుకుని యమపురికి తీసుకెళతారు. 13వ రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం వల్ల కూడా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. యముడు ఆత్మ యొక్క పనుల ఆధారంగా న్యాయం చేస్తాడు.


Also Read: Guru Vakri 2022: మీనంలో త్రికోణ రాజయోగం... ఈ 3 రాశులవారికి అంతులేని ధనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook