Planet Changes october 2022: అక్టోబరులో 5 గ్రహాల సంచారం... ఈ రాశులవారి జీవితం కష్టాలమయం!
October Rashifal 2022: వచ్చే నెలలో కొన్ని ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. ఈ గ్రహాల సంచారం ప్రభావం కొన్ని రాశులవారికి ప్రతికూలంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
October Plant Transit Horoscope: అక్టోబర్‌లో సూర్యగ్రహణంతోపాటు కొన్ని గ్రహ సంచారాలు జరుగనున్నాయి. ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని గ్రహాలు తమ స్థానాన్ని మార్చనున్నాయి. ఈ గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మిథునం (Gemini): వచ్చే నెలలో మిథునరాశివారు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు అప్పులు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోండి. గ్రహాల సంచారం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంది.
కర్కాటక రాశి (Cancer): ఈరాశి వారు కూడా అక్టోబర్‌లో ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. మీ కెరీర్ లో సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఈ సమయం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు.
కన్యారాశి (Virgo): గ్రహాల గమనం ప్రకారం కన్యా రాశి వారికి అక్టోబర్ నెల కష్టతరంగా ఉంటుంది. మీరు ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అలాగే మీ వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఎదురువుతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావచ్చు.
వృశ్చిక రాశి (Scropio): వృశ్చికరాశి వారికి అక్టోబరు మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.. మీరు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోనే అవకాశం ఉంది. ఈ నెలలో మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
మీనం (Pisces): అక్టోబర్ నెలలో మీన రాశివారు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ మాసంలో ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఉండవచ్చు. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
Also Read: Astro Tips: ఈ రోజు జుట్టుకు నూనె రాస్తే శని దోషం పోయి.. ఐశ్వర్యం పెరుగుతుందట..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok