Astro Tips: ఈ రోజు జుట్టుకు నూనె రాస్తే శని దోషం పోయి.. ఐశ్వర్యం పెరుగుతుందట..!

Vastu Tips for Oil Massage: బాడీకి, జట్టుకు నూనె రాయడం వల్ల శనిదోషం తొలగిపోతుందట. అంతేకాకుండా మీ ఐశ్వర్యం కూడా పెరుగుతుందట.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2022, 12:01 PM IST
Astro Tips: ఈ రోజు జుట్టుకు నూనె రాస్తే శని దోషం పోయి.. ఐశ్వర్యం పెరుగుతుందట..!

Best day for oil massage: ఆస్ట్రాలజీ ప్రకారం, మనం చేసే మంచి, చెడులను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. శనిదేవుడి (Shani Dev) కటాక్షం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శనిదేవుడి వక్రదృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి అనేక బాధలను అనుభవించాల్సి ఉంటుంది. శనివారం శనిదేవుడిని పూజిస్తారు. శనిదేవుడికి నూనెను నైవేద్యం పెట్టడం వల్ల శనిదోషం తొలగిపోయి అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం మరియు జుట్టుపై నూనెను సరైన మార్గంలో మసాజ్ చేయడం ద్వారా శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. 

నూనె రాయడం వల్ల ప్రయోజనాలు
శరీరానికి నూనెను మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అలసట మరియు బలహీనతను తొలగిస్తుంది. కండరాలు బలపడతాయి, చర్మం మెరుస్తుంది. అదేవిధంగా తలకు మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది, జుట్టు మృదువుగా, దృఢంగా, నల్లగా మారుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. శని దేవుడి అనుగ్రహంతో సంపద మరియు గౌరవం పెరుగుతుంది. 

>> సోమవారం నూనెతో మర్దన చేయడం వల్ల అందం పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
>> బుధవారం ఆయిల్ మసాజ్ చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు శరీరం మరియు జుట్టుకు నూనెను మర్దన చేయడం వల్ల సంపద పెరుగుతుంది.
>> శుక్రవారం రోజు నూనె రాసుకోవడం వల్ల అందం, ఆకర్షణ పెరుగుతుంది.
>> శనివారం రోజు శరీరానికి, తలకు నూనె రాసుకోవడం వల్ల శని దోషం తొలగిపోయి జీవితంలో సంతోషం కలుగుతుంది.
>> ఆది, మంగళ, గురువారాల్లో నూనె రాసుకోకూడదని గుర్తుంచుకోండి. లేకుంటే ధన నష్టం, ఆరోగ్యం చెడతాయి. 

Also Read: Shukra Gochar 2022: కన్యారాశిలో శుక్రుడి సంచారం... ఈ 4 రాశులవారికి అదృష్టం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News