Planet transit 2022: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలు చేయడాన్ని ముఖ్యమైన సంఘటనలుగా పేర్కొన్నారు. ఎందుకంటే గ్రహాల సంచారం, తిరోగమనం కారణంగా చాలా మంది జీవితాల్లో వివిధ రకాల మార్పులు జరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొందరిలోనైతే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి. అయితే ఈ డిసెంబర్‌ నెలలో చాలా గ్రహాలు తమ సొంత రాశులను వదిలి ఇతర రాశుల్లోకి సంచారం చేయబోతున్నాయి. దీంతో చాలా రకాల మార్పులు జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో బుధ, శుక్ర గ్రహాలు సంచారం జరగడంతో మహారాజయోగాలు ఏర్పడే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 28న బుధ గ్రహం మకరరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అంతేకాకుండా డిసెంబర్ 29న శుక్రుడు కూడా అదే రాశిలోకి సంచారం చేయడంతో  ఈ కింది రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ రెండు గ్రహాల కలయికతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల చాలా రాశులవారికి ఆర్థిక సమస్యలు తీరే ఛాన్స్ కూడా ఉంది.


ఏ మూడు రాశుల వారికి లాభాలే లాభాలు:
మకర:
బుధుడు, శుక్రుడు ఒకే రాశిలోకి సంచారం చేయబోతున్నందున ఈ రాశివారి జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు జరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా మకర రాశి వారు ఆర్థికంగా చాలా ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు పొందడమేకాకుండా మంచి గుర్తింపు సాధిస్తారు.  ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమయ్యే వారికి విజయం లభిస్తుంది.


ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి కూడా ఈ సంచారం లాభదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ రాశివారు సంచారల ప్రభావంతో చాలా రకాల ప్రయోజనాలు పొందే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ సంచారం వల్ల ఉద్యోగాలు చేస్తున్నవారికి పదోన్నతులు లాభించే ఛాన్స్‌ ఉంది.


మీన:
ఒకే రాశిలోకి రెండు గ్రహాలు సంచారం చేయడం వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో మీన రాశి వారు కూడా ధనలాభాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో వీరి ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారాల పరంగా కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.


Also Read : Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్


Also Read : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook