June 2022 Planetary Changes: జూన్‌లో రాశిచక్రాన్ని మార్చబోతున్న 5 గ్రహాలు.. ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..!
Planet Transits in June 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ నెల చాలా ముఖ్యమైనది. జూన్ 2022లో 5 గ్రహాలు రాశిచక్రాన్ని మార్చబోతున్నాయి. ఇది అన్ని రాశులపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.
Planet Transits in June 2022 effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. ఈ గ్రహ మార్పులు ప్రజలందరిపై మంచి లేదా చెడు ప్రభావం చూపుతాయి. వచ్చే జూన్‌లో 5 ముఖ్యమైన గ్రహ రాశులు (planetary changes in june 2022) మారబోతున్నాయి.
మొదటి నెల ప్రారంభంలో..బుధ గ్రహం యొక్క కదలిక మారుతుంది. జూన్ 3 నుండి, బుధ గ్రహం వృషభరాశిలో సంచరించనుంది. దీని తరువాత జూన్ 5 నుండి శని తన స్వంత రాశిచక్రం కుంభరాశిలో తిరోగమనం వైపు కదులుతుంది. ఆ తర్వాత జూన్ 15న గ్రహాల రాజు సూర్య రాశిని మారుస్తాడు. ఇది కాకుండా, జూన్‌లో శుక్రుడు మరియు అంగారకుడు కూడా రాశిని మారుస్తారు. ఈ ఐదు గ్రహ సంచారాలు 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటాయి. ఆ రాశులేంటో చూద్దాం.
వృషభం (Taurus): వృషభ రాశి వారికి జూన్ 2022 చాలా శుభప్రదం కానుంది. వీరికి ఈ నెలలో చాలా అదృష్టం ఉంటుంది. మీరు మీ కెరీర్‌లో గొప్ప పురోగతిని పొందుతారు. కొత్త ఉద్యోగంలో చేరేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు చాలా సంపాదిస్తారు కాబట్టి మీరు సులభంగా పెద్ద పొదుపు చేయగలుగుతారు. ఈ నెలలో వ్యాపారులకు కూడా చాలా లాభాలు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ నెలను పూర్తిగా ఆనందించండి.
సింహరాశి (Leo): 2022 జూన్‌లో జరిగే గ్రహ సంచారాలు సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గౌరవంతోపాటు ఆదాయం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వ ఆకర్షణ పెరుగుతుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందం జరగవచ్చు. పాత పనులు కూడా ఇప్పుడు పూర్తవుతాయి. మీరు ప్రశంసించబడతారు. పోటీలో విజయం సాధించవచ్చు. మొత్తంమీద, ఈ మాసం ప్రతి విషయంలోనూ శుభప్రదంగా ఉంటుంది.
ధనుస్సు (Sagittarius): ధనుస్సు రాశి వారు జూన్ 2022లో ఆర్థికంగా చాలా పురోగతిని సాధిస్తారు. ధన లాభం ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేయగలుగుతారు. వ్యాపారులు కొత్త ఆర్డర్‌ను పొందవచ్చు. భవిష్యత్తు కోసం ఒక పెద్ద ఒప్పందం ఉండవచ్చు. పెండింగ్‌లో ఉన్న పాత డబ్బును తిరిగి పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి.
Also Read: Shani Jayanti 2022: ఈ 3 రాశుల వారికి శని సడే సతి తొలగిపోవాలంటే ఏం చేయాలి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి