Planet Transits 2022: సెప్టెంబరులో 3 గ్రహాల రాశి మార్పు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు..!
September Planet Transits 2022: సెప్టెంబర్ నెలలో కొన్ని రాశులు తమ రాశిని మార్చనున్నాయి. వీటి రాశి మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో చూద్దాం.
September Planet Transits 2022: గ్రహాల రాశి మార్పు మెుత్తం 12 రాశుల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. ఈసారి సెప్టెంబర్ నెలలో 3 గ్రహాలు రాశిని (September Planet Transits 2022) మార్చనున్నాయి. సెప్టెంబర్ 17న సూర్యుడు సింహరాశి నుండి కన్యారాశిలోకి, బుధుడు సెప్టెంబర్ 10న తిరోగమనంలోనూ, సెప్టెంబర్ 24న శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ 3 గ్రహాల స్థానం మారడం వల్ల కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపార, ఆర్థిక విషయాలలో విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
వృషభ రాశి (Taurus): గ్రహాల స్థానాల్లో మార్పులు వృషభ రాశి వారిపై శుభ ప్రభావం చూపుతాయి. కెరీర్ పరంగా లాభపడతారు. ఆఫీసులో సీనియర్ల నుండి సపోర్టు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు తమ బిజినెస్ లను మరింతగా విస్తరిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ సమయంలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ నెలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మంచిది.
మిథునం (Gemini): ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వీళ్ల కెరీర్ చాలా బాగుంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సమయంలో చదువుకునే వారు కొంత నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటక రాశి (Cancer): సెప్టెంబర్ నెల ఈ రాశివారి అదృష్టం ప్రకాశిస్తుంది. ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. ప్రతి విషయంలోనూ ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. ఎక్కడైనా మీ డబ్బు ఇరుక్కుపోతే మీ చెంతకు చేరుతుంది. ఆరోగ్య పరంగా ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కుంభరాశి (Aquarius): కుంభ రాశి వారికి లక్ కలిసి వస్తుంది. వీరు అపారమైన సంపదను పొందుతారు. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ సమయం వ్యాపారులకు కలిసి వస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి మరలే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరగుపడతారు.
మీనం (Pisces): మీన రాశి వారికి ఈ నెల చాలా అదృష్టాన్ని తెస్తుంది. మీ కెరీర్ సూపర్ గా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా మీరు వాటిని అధిగమిస్తారు. విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. సింగిల్స్ కు పెళ్లి జరిగే అవకాశం ఉంది.
Also Read: Sun Venus Conjunction 2022: మరో 6 రోజుల్లో ఈ రాశులవారి లైఫ్ డబ్బు మయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook