Surya Grahan 2023: సూర్యగ్రహణం నాడు అశుభ యోగం.. ఈ 5 రాశులవారికి నరకం..
Solar eclipse 2023: ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈరోజున కొన్ని గ్రహాల సంయోగం ఏర్పడబోతుంది. ఇది ఐదు రాశులవారికి నరకప్రాయంగా ఉంటుంది.
Surya Grahan 2023 effect: మరో ఆరు రోజుల్లో ఖగోళంలో కీలక సంఘటన జరగబోతుంది. ఏప్రిల్ 20, గురువారం నాడు ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం మేషం మరియు అశ్వనీ నక్షత్రాల్లో ఏర్పడనుంది. అంతేకాకుండా ఇదే రోజున కొన్ని అద్భుత గ్రహాల కలయిక ఏర్పడనుంది. కుజుడు మిధునరాశిలోకి, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు అశుభ యోగం ఏర్పడుతోంది.
సూర్యగ్రహణం సమయంలో రాహువు, బుధ గ్రహంతో కలిసి సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. మేషరాశిలో బుధుడు, మిథునరాశిలో కుజుడు ఉండటం వల్ల రాశి మారుతున్న యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూలంగానూ, కొన్ని రాశులపై సానుకూలంగానూ ఉంటుంది. సూర్యగ్రహణం సమయంలో ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
1. మేషం
సూర్యగ్రహణం మేషరాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. మీపై ఉన్న నమ్మకం పోవచ్చు. మీరు కోర్టు కేసుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. వ్యాపారులు నష్టపోతారు. మీ ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
2. వృషభం
రాశి మార్పు యోగం వృషభ రాశి వారికి మంచిది కాదు. మీ ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. ఆఫీసులో సహచరులతో గొడవలు అవుతాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రయాణాలు మానుకోండి.
3. కన్య
కన్యారాశి వారికి సూర్యగ్రహణం రాశి మార్పు అశుభం. మీరు మానసికంగా కలవరపడతారు. కుటుంబంలో విభేదాలు వస్తాయి. మీకు మానసిక ప్రశాంతత ఉండదు. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తుతాయి.
4. తులారాశి
సూర్యగ్రహణం తుల రాశి వారికి వ్యాపారంలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. పెట్టుబడి పెట్టడం మానుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ప్రయాణాలు అనుకూలించవు.
5. మకరం
మకర రాశి వారు ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు ఎదుర్కోంటారు. పని ప్రదేశంలో ఆటంకాలు వస్తాయి. మీరు నీరసించే పోయే అవకాశం ఉంది.
Also Read: Sun Transit 2023: సూర్యగ్రహ సంచారంతో ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం!, ప్రయోజనాలతో పాటు నష్టాలు తప్పవా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook