Planets transit in March 2024: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకుంటాయి. మార్చి నెలలో కూడా కొన్ని గ్రహాలు గమనంలో పెను మార్పు రాబోతుంది. వచ్చే నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు సూర్యుడు తమ రాశులను మార్చబోతున్నాయి. శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉదయించబోతుంది. మార్చి 07న బుధుడు మీనరాశిలోనూ, అదే రోజు శుక్రుడు కుంభరాశిలోనూ సంచరించనున్నారు. ఇదే రాశిలో సూర్యుడు, శుక్రుడు మరియు శని కలయిక జరగబోతుంది. మార్చి 14న సూర్యుడు మీనరాశిలోకి వెళ్లనున్నాడు. మార్చి 15న కుంభరాశిలో కుజుడు సంచరించబోతున్నాడు. ఈ గ్రహాల కదలిక వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి
మార్చిలో గ్రహాల సంచారం సింహరాశి వారికి మేలు చేయబోతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మార్చి నెల అద్భుతంగా ఉండబోతుంది. మీరు టేకాఫ్ చేసిన ప్రాజెక్టును అనుకున్న టైంకు పూర్తి చేస్తారు. మీ డ్రీమ్స్ నెరవేరుతాయి.  మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


Also Read: Mangal Gochar 2024: రాశి మారనున్న కుజుడు.. ఈ 5 రాశులకు లాభాలు బోలెడు..


వృషభరాశి
గ్రహాల రాశిలో మార్పుల వల్ల వృషభరాశి వారి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ శాలరీ పెరుగుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. 
కర్కాటకం
మార్చి నెల కర్కాటక రాశి వారికి చాలా బెనిఫిట్స్ ను ఇవ్వబోతుంది. వచ్చే నెలలో పెట్టే పెట్టుబడులు మీకు చాలా లాభాలను ఇవ్వబోతున్నాయి. ఫారిన్ వెళ్లాలన్న మీ కోరిక నెరవేరుతోంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. 


Also Read: Shani Uday 2024: త్వరలో ఈ 3 రాశులకు శనిదేవుడి కటాక్షం.. ఇక వీరికి తిరుగుండదు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook