Pournami 2022: రేపు, ఈ రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది..
Pournami 2022: దీపావళి పండగ రాకముందు లక్ష్మీదేవికి కొన్ని ప్రీతికరమైన రోజులు ఉన్నాయి. అందులో ఈరోజు (శనివారం) ఎంతో ప్రీతికరమైన రోజని శాస్త్రం తెలుపుతోంది. ఈ రోజున అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారి అనుగ్రహం, ఆశీస్సులు లభిస్తాయి.
Pournami 2022: ఈరోజు (శనివారం) లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు.. దీపావళి ముందు వచ్చే శని శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజులని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ముఖ్యంగా రేపు (ఆదివారం) శరత్ పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో లక్ష్మీదేవితో పాటు శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి మీకు దగ్గర్లో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలోకి వెళ్లి అమ్మవారిని పూజించడం చాలా మంచిదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇలా పూజించడమే కాకుండా అమ్మవారికి ఇష్టమైన పనులు నైవేద్యాలు సమర్పించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఎలాంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నైవేద్యాలను లక్ష్మీదేవికి సమర్పించండి:
కుంకుమ పువ్వుతో చేసిన అన్నం:
అమ్మవారికి కుంకుమపువ్వు అంటే చాలా ఇష్టం. కాబట్టి వీటిని తరచుగా దేవుళ్లకు నైవేద్యం చేసే క్రమంలో వినియోగిస్తారు. పసుపు రంగుతో కూడిన కుంకుమపువ్వు అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రం పేర్కొంది.
తీపి పదార్థాలు:
లక్ష్మీదేవికి వివిధ రకాల పిండిలతో చేసిన పిండి వంటలంటే చాలా ఇష్టం. ఇక వీటిలోనే చెక్కరతో చేసిన వంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలని శాస్త్రం చెబుతోంది.
ఖీర్:
అన్నంతో తయారుచేసిన పాయసంలో ఎండు ద్రాక్ష జీడిపప్పును వేసి తయారుచేసిన మిశ్రమాన్ని ఖీర్ అని అంటారు. ఈ ఖీర్ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి పూజా క్రమంలో లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉంటారు.
కొబ్బరి:
కొబ్బరితో చేసిన ఆహారాలు కూడా లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. దీనితో చేసిన పరమాన్నాలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని శాస్త్ర గ్రంథాల్లో పేర్కొన్నారు. కాబట్టి అమ్మవారి పూజా క్రమంలో కొబ్బరితో చేసిన ఆహారాలు సమర్పించాలి.
దానిమ్మ:
దానిమ్మ పళ్ళు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వీటిని దీపావళి పూజా క్రమంలో అమ్మవారికి సమర్పిస్తే.. అమ్మవారి అనుగ్రహం లభించడమే కాకుండా కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయని శాస్త్రం తెలుపుతోంది.
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook