Jagannath rath yatra 2022 Date: దేశవ్యాప్తంగా పూరీ జగన్నాథ రథయాత్ర చాలా ప్రసిద్ధి చెందింది. చాలా ప్రాంతాల్లో జగన్నాథుని రథయాత్ర జరుగుతున్నప్పటికీ.. ఒడిశాలో జరిగే ఈ రథయాత్ర (Jagannath Rath Yatra 2022) క్రేజే వేరు.  జ్యేష్ఠ పూర్ణిమ (Jyeshtha Purnima 2022) రోజున జగన్నాథుడు, సోదరి సుభద్ర మరియు అన్నయ్య బలభద్రలు పుణ్యస్నానం చేస్తారు. తర్వాత ముగ్గురినీ ఆలయ గర్భగుడిలో ఉంచి రెండో రోజు నుంచి గర్భగుడి తలుపులు మూసేస్తారు. అనంతరం 15 రోజుల తర్వాత జగన్నాథుడు రథంపై బయల్దేరి భక్తులకు దర్శనం ఇస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళే జగన్నాథుడికి స్నానం
జగన్నాథుని రథయాత్రకు (Puri Jagannath Rath Yatra 2022) సన్నాహాలు చాలా కాలం ముందుగానే ప్రారంభమవుతాయి. జూన్ 14న పౌర్ణమి రోజున జగన్నాథుడు భక్తులకు దర్శనం ఇస్తారని.. సాయంత్రం 4 గంటల నుంచి స్వామిని గర్భాలయం నుంచి బయటకు తీసుకొచ్చి స్నానం చేయిస్తారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జగన్నాథునితో పాటు, సోదరి సుభద్ర మరియు అన్నయ్య బలభద్రుడు కూడా స్నానం చేస్తారు. ఆ తర్వాత 15 రోజుల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. రథ ద్వితీయ రోజున ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. జూన్ 30న జగన్నాథుని కన్నులు తెరిచే క్రతువు జరుగుతుంది.


జూలై 1న రథయాత్ర ప్రారంభం
జగన్నాథుడు జూలై 1 నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇందుకోసం జగన్నాథుడు తన సోదరి సుభద్ర, అన్న బలభద్రలతో కలిసి రథాన్ని అధిరోహిస్తారు. ఈ పవిత్రమైన రథయాత్రలో పాల్గొనడానికి దేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనడం ద్వారా 100 యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు. దీనితో పాటు, ఎవరైనా రథయాత్రలో పాల్గొని గుండిచా నగరానికి వెళితే, అతను జీవన్మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడని మరియు అతను బైకుంత్ ధామ్‌లో చోటు పొందుతాడని మత గ్రంథాలలో చెప్పబడింది.


Also Read: Jyeshtha Purnima 2022: స్త్రీలు అఖండ సౌభాగ్యం పొందాలంటే.. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఈ వ్రత కథ చదవండి!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook