Rahu And Ketu: చాలా లేట్‌గా రాహు తిరోగమనం.. ఈ రాశులవారికి ఊహించని నష్టాలే..
Rahu And Ketu: శని గ్రహం తిరోగమనం చాలా నెమ్మదిగా జరుగుతుంది. అయితే ఇదే పద్ధతిలోనే రాహు తిరోగమనం చెందుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.
Rahu And Ketu: శని గ్రహాలు ఇతర రాశుల్లోకి సంచారం చేసిన తర్వాత ఇతర రాశుల్లోకి వెళ్లేందుకు నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అయితే శని గ్రహమేకాకుండా రాహువు కూడా చాలా నెమ్మదిగా కదులుతుందని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ గ్రహం ఎప్పుడు రివర్స్ మోషన్‌లో అంటే తిరోగమనంలో ప్రయాణిస్తుంది. ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి ఒకటిన్నర సంవత్సరాలు పట్టడానికి ఇదే కారణమని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే వచ్చే సంవత్సరంలో అనగా 2023లో రాహువు మేష రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.
ఈ సంచారం 2023 అక్టోబర్ 30న జరగనుంది. కాబట్టి దీని ప్రభావం అన్ని రాశువారిపై పడే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఈ కింది రాశువారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా ఈ రాశువారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రాహువుతో ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
ఈ రాశువారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది:
తులారాశి:
తులారాశి వారు ఈ క్రమంలో చాలా రకాల సమస్యలతో బాధపడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపార విషయాలలో చాలా రకాల నష్టాలను చవి చూస్తారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే అంతే సంగతి. కాబట్టి ఎలాంటి పనులు చేసిన తప్పకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంచారం వల్ల కార్యాలయంలో సహోద్యోగులతో వాగ్వాదాలు పెరగవచ్చు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
మేషం:
రాహు సంచారం వల్ల ఈ రాశివారి తెలివితేటల్లో చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సంచారం వల్ల వివాదాలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఇంటి సభ్యులతో కూడా వాగ్వాదానికి దిగవచ్చు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మకరం:
మకర రాశివారికి వైవాహిక జీవితంలో చిక్కులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ సంబంధాలు బలహీనపడతాయి. కాబట్టి ఈ సంచార క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రమంలో అతి పెద్ద విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే తీవ్ర సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.
వృషభం:
వృషభ రాశి వారు కూడా ఈ సంచారం క్రమంలో చాలా రకాల నష్టాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఖర్చులన్ని పెరిగి ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. రాహువు మిమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బంది పెట్టొచ్చని..ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. షార్ట్‌కట్ పద్ధతుల ద్వారా విజయం సాధించాలనే తపన మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అంతేకాకుండా చాలా అనారోగ్య సమస్య బారిన పడే అవకాశాలున్నాయి.
Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook