COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mars Ketu Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతులను పాప గ్రహాలుగా పరిగణిస్తారు. ఇవి సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై అశుభ ప్రభావాన్ని కలిగిస్తాయని భయపడుతూ ఉంటారు. కానీ ఈ గ్రహాలు వ్యక్తుల జాతకాల స్థానాలను బట్టి ఆధారపడి ఫలితాలనిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వ్యక్తుల జాతకంలో రాహు కేతు గ్రహాలు శుభ స్థానంలో ఉంటే జీవితం ఎంతో శుభప్రదంగా మారుతుందని అదృష్టం కూడా నిద్రలేచి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 


అంతేకాకుండా రాహు కేతు గ్రహాలు ఒకటిన్నర సంవత్సరాలకు ఒకసారి రాశి సంచారం చేస్తూ ఉంటాయి. ఈ గ్రహాలు ఎప్పుడు తీరుగమన స్థితిలో తిరుగుతూ ఉంటాయి. అయితే అక్టోబర్ 30వ తేదీన రాహు కేతువులు వాటి గమనాన్ని మార్చుకోబోతున్నాయి రాహువు గ్రహం 30వ తేదీన మీన రాశిలోకి సంచారం చేస్తే కేతు గ్రహం కన్యారాశిలోకి వెళ్లబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పెరిగితే మరికొన్ని రాశుల వారికి అనేక రకాల సమస్యలు రావచ్చు.


మేష రాశి వారు ఈ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని నిండి ఉంటారు. వీరు ఈ సమయంలో స్నేహితుల సహాయం కోరి వ్యాపార ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. ముఖ్యంగా స్త్రీలైతే ఈ సమయంలో ఊహించని లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగాలు చేసే వారికి తోటి ఉద్యోగుల మద్దతు లభించి ఊహించని లాభాలు పొందుతారు. ఈ సమయంలో మేష రాశి వారిగా ఆదాయం కూడా పెరుగుతుంది.


వృషభ రాశి వారు రాహు కేతు సంచారాల కారణంగా సంగీతం పట్ల ఆసక్తి పెంచుకుంటారు. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అదనపు ఖర్చుల కారణంగా ఆందోళన కూడా చెందుతారు. ఉద్యోగాలు చేసే వారికి అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు కుటుంబ సభ్యులతో ఈ సమయంలో ఆనందంగా గడుపుతారు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


కర్కాటక రాశి వారికి కూడా రాహు కేతువు సంచారాల కారణంగా మనసు చంచలంగా ఉంటుంది అవసర వివాదాలు గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మానసిక ప్రశాంతత లభించడానికి కోపాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ తల్లిదండ్రుల మద్దతు లభించి ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా శత్రువులపై కూడా విజయాలు సాధిస్తారు.


సింహ రాశి వారికి ఈ సంచారాల కారణంగా ఆశా నిరాశ శ్రమ భావనలు ఉంటాయి చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది ఓపిక లేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు. దీంతోపాటు జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్సులు ఉన్నాయి. వీరు ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


మకర రాశి వారికి కూడా ఈ సమయంలో మనస్సు చంచలంగా ఉంటుంది. వీరు స్వీయ నియంత్రణలో ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా కోపం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి ప్రకృతిలో చిరాకు అనిపించవచ్చు. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదనపు ఖర్చులు కూడా రెట్టింపు అవుతాయి ఉన్నత విద్య కోసం మకర రాశి వారు విదేశాలు కూడా వెళ్ళవచ్చు. కుటుంబ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాలు జాగ్రత్తలు పాటించాలి.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి