Rahu Favourite Zodiac Signs In Telugu: అశుభంగా పరిగణించే గ్రహాల్లో రాహువు గ్రహం ఒకటి. ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడం వల్ల కీడు ప్రభావం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల జీవితాలపై కూడా కొంత ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహం అశుభ స్థానంలో ఉన్న రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అదే ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్న రాశులవారికి డబ్బు, కీర్తికి ఎలాంటి డోకా ఉండదు. కొన్ని సందర్భాల్లో ఈ గ్రహం కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో ధనికులు కూడా బీదవారవుతారు. అంతేకాకుండా అనేక సమస్యలు వస్తాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహువు ప్రభావం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు గ్రహ అన్ని రాశులవారిపై ఎల్లప్పుడూ చెడు దుష్ప్రభావాలను కలిగించడు. అంతేకాకుండా ఈ గ్రహానికి ఇష్టమైన కొన్ని రాశులు కూడా ఉంటాయి. ఈ రాశులవారికి రాహువు ఎలాంటి కష్టం రానించరు. అంతేకాకుండా ఏవైనా కష్టాలు వచ్చిన ఎంతో సుభంగా విముక్తి కలిగిస్తారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలను కూడా సులభంగా నెరవేర్చుతారు. అలాగే ఎలాంటి పెద్ద ప్రమాదాలైనా తట్టుకునే శక్తిని అందిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు గ్రహానికి ఎలాంటి రాశులంటే ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.


వృశ్చికరాశి:
రాహువు గ్రహానికి ఎంతో ఇష్టమైన రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి. ఈ రాశివారికి ఎల్లప్పుడూ అనుగ్రహం లభిస్తుంది. దీంతో పాటు వీరికి జీవితంలో చాలా పురోగతి సాధించి అనుకున్న విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో అనుకున్న పనులు కూడా జరుగుతాయి. అలాగే జీవితంలో ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే జీవితంలో ఆకస్మిక విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ లాభాలు కూడా పొందుతారు.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


సింహ రాశి:
సింహ రాశివారికి కూడా రాహువు అనుగ్రహం ఎలాంటి సమయాల్లోనైనా లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి జీవితంలో పెద్ద సమస్యల నుంచి విముక్తి కలిగిచేందుకు రాహువు చాలా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాడు. అంతేకాకుండా మానసి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. అనుకున్న పనులు జరగడమే కాకుండా ఆనందం కూడా లభిస్తుంది. అంతేకాకుండా పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు కూడా లభిస్తాయి. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి