2024 Rahu Gochar effect on Zodiac Signs: రాహు, కేతువుల అంటే మనలో చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఆ గ్రహాలు ఎప్పుడు చెడు ఫలితాలనే ఇస్తాయని నమ్మకం. పురాణాలు, జ్యోతిష్యశాస్త్ర పరంగా రాహు, కేతువులకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటినే ఛాయా గ్రహాలు లేదా అంతుచిక్కని గ్రహం లేదా క్రూరమైన గ్రహాలుగా పిలుస్తారు. ఈ ఫ్లానెట్స్ ఎప్పుడూ తిరోగమన దిశలోనే కదులుతాయి. ఇవి ఏడాదిన్నరకు ఒకసారి తమ రాశులను మార్చుకుంటాయి. ప్రస్తుతం రాహువు మీనరాశిలో సంచరిస్తున్నాడు. 2024లో కూడా అతడు అదే రాశిలో కొనసాగుతాడు. రాహు సంచారం వల్ల వచ్చే సంవత్సరం ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుల: 
రాహువు కదలిక తులరాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వనుంది. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. మీరు లగ్జరీగా బతుకుతారు. నలుగురిలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 2024లో మీరు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 
వృషభం: 
మీనరాశిలో రాహు సంచారం వృషభరాశి వారికి కొత్త సంవత్సరంలో కూడా కలిసి రానుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు పలు వ్యాపారాలు చేయడం వల్ల భారీమెుత్తంలో ధనాన్ని ఆర్జిస్తారు. జాబ్ చేసేవారికి శాలరీ పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. ఎంతో కాలంగా ఎదురూచుస్తున్న నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు వస్తాయి. అంతేకాకుండా జాబ్ కూడా కొడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
కుంభం: 
కుంభ రాశి వారికి రాహువు సంచారం 2024లో ఊహించని మెుత్తంలో ధనాన్ని ఇవ్వనుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వం ఉద్యోగం వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి  మీరు నలుగురికి ఆదర్శం అవుతారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.


Also Read: Budh Gochar 2023-2024: బుధుడు రాశి మార్పు.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook