Rahu Rashi Parivartan 2023:  జ్యోతిష్య శాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా భావిస్తారు. 2023లో చాలా గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. రాహువు అక్టోబరు 30న తన రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. ఇతడు ఆరోజు మధ్యాహ్నాం 12.30 గంటలకు మేషరాశి నుంచి బయలుదేరి మీనరాశిలోకి (Rahu Gochar 2023) ప్రవేశించనున్నాడు. ఈ రాశి మార్పు వల్ల కొన్ని రాశులవారు లాభపడతారు. వారికి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం (Aries): జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువు యొక్క ఈ సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ధన లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. 
కర్కాటకం (Cancer): రాహువు సంచారం వల్ల కర్కాటక రాశి వారు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు శుభవార్తను వింటారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. 
మీనరాశి (Pisces): 2023లో రాహువు మేషరాశి నుంచి బయటకు వెళ్లి మీనరాశిలోకి ప్రవేశించాడు. దీంతో మీరు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. ధనలాభం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కెరీర్‌లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది. 


Also Read: Budhaditya Rajyog: మకరంలో బుధాదిత్య రాజయోగం.. 2023లో ఈ 3 రాశులకు అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook