Rahu Grah Effect 2023: ఆస్ట్రాలజీలో రాహు గ్రహాన్ని ఛాయా గ్రహం అంటారు. 2023 సంవత్సరంలో రాహు మేషరాశిలో సంచరించనున్నాడు. కొత్త ఏడాదిలో ఇతడు తన స్థానాన్ని మార్చనున్నాడు. అక్టోబరు నెలలో రాహు మేష రాశిని విడిచి మీనరాశిలోకి (Rahu transit in Pisces 2023) ప్రవేశించనున్నాడు. రాహు గ్రహం ఎల్లప్పుడూ రివర్స్ లోనే కదులుతూ ఉంటుంది. అందుకే రాహు అశుభ ఫలితాలను ఇస్తాడు. నూతన సంవత్సరంలో రాహు గ్రహ సంచారం నాలుగు రాశులవారికి కష్టాలను రెట్టింపు చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి (Aries): రాహు గ్రహం మీ జాతకంలోని లగ్న స్థానంలో సంచరిస్తోంది. ఇతరులతో మీకు వివాదాలు రావచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మెుత్తంగా ఈ సమయం మీకు చాలా కఠినంగా ఉంటుంది 


వృషభ రాశి (Taurus): రాహు గ్రహం సంచారం వల్ల మీ రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంతో మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు బిజినెస్ లో ఏదైనా పెద్ద డీల్ కుదుర్చుకున్నట్లయితే అది పెండింగ్ లో ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో కొత్తగా దేనిని ప్రారంభించకండి. మీరు మానసికంగా కూడా కుంగిపోయే అవకాశం ఉంది. 


మకర రాశి (Capricorn): మీ కుటుంబ సంబంధాలు క్షీణించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. శత్రువుల పట్ల అప్రమత్తతో మెలగండి. కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వస్తాయి. 


మీన రాశి (Pisces): రాహు గ్రహ సంచారం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో డబ్బు ఎవరికీ అప్పుగా ఇవ్వద్దు, లేకుంటే నష్టపోతారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దానిని వెంటనే విరమించుకోండి. 


Also Read: Shani Gochar 2023: కుంభంలోకి శనిదేవుడు.. కొత్త ఏడాదిలో ఈ 4 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.